Categories: LATEST UPDATES

మనీ ల్యాండరింగ్ కేసులో బిల్డర్ కు ఈడీ కస్టడీ

రూ.700 కోట్ల మనీ ల్యాండరింగ్ కేసులో ఓ బిల్డర్ ను విచారించేందుకు ఈడీ కస్టడీకి అనుమతి ఇస్తూ ముంబై కోర్టు ఆదేశాలిచ్చింది. ముంబైకి చెందిన విజయ్ మచీందర్ అనే బిల్డర్ ను జనవరి 12 వరకు ఈడీ కస్టడీకి ఇచ్చింది. పలువురు ఫ్లాట్ కొనుగోలుదారులను మోసం చేసిన కేసులో ఈడీ ఆయన్ను మనీ ల్యాండరింగ్ కేసు కింద అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టగా.. విచారణ నిమిత్తం ఆయన్ను ఈడీ కస్టడీకి కోర్టు అనుమతించింది. ‘ఇలాంటి నేరాల్లో భారీ మొత్తంలో ప్రజల సొమ్ము ముడిపడి ఉంటుంది. ఇక్కడ రూ.734 కోట్ల మేర అక్రమాలు జరిగాయి. ఈ మొత్తం ఎక్కడకు ఎలా వెళ్లిందనే అంశాన్ని నిగ్గు తేల్చాల్సిన బాధ్యత ఈడీపై ఉంది. అందువల్ల నిందితుడిని ఈడీ కస్టడీకి ఇస్తున్నాం’ అని కోర్టు పేర్కొంది. ఈ కేసులో ఫిర్యాదుదారు 14 ఫ్లాట్ల కొనుగోలు నిమిత్తం ఓ బ్యాంకు ఖాతా ద్వారా రూ.15.6 కోట్లు, మరో ఖాతా ద్వారా రూ.28 కోట్లు చెల్లించారు. అయితే, బిల్డర్ కేవలం మూడు ఫ్లాట్లకు మాత్రమే అలాట్ మెంట్ లెటర్ ఇచ్చారు. అంతేకాకుండా పలువురు ఇతర కొనుగోలుదారుల్లో ఒక్కరికి కూడా ఫ్లాట్ అప్పగించేదు. పైగా నిర్మాణం సైతం చేపట్టలేదు. దీంతో ఈ వ్యవహారంపై విచారణ జరిపిన ఈడీ రూ.734.27 కోట్ల మేర అవతవకలు జరిగినట్టు నిర్ధారించింది.

This website uses cookies.