Categories: Celebrity Homes

రెండు ప్రాపర్టీలు కొన్న అల్లు అర్జున్?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన రియల్ ఎస్టేట్ పోర్టిపోలియోను విస్తరించుకుంటున్నారు. తాజాగా ఈ పుష్పరాజ్ హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో రెండు కొత్త ప్రాపర్టీలు కొన్నట్టు సమాచారం. వెంకటగిరితోపాటు జూబ్లీహిల్స్ లోని ప్రైమ్ ఏరియాలో రెండు ప్రాపర్టీలు కొని.. అక్కడ కొత్తగా ఇల్లు, ఆఫీసు నిర్మిస్తున్నట్టు తెలుస్తోంది. కొత్త ఇల్లు 3వేల చదరపు గజాల స్థలంలో నిర్మిస్తుండగా.. ఇప్పటికే దాదాపు 60 శాతం పనులు పూర్తయినట్టు సమాచారం. పుష్ప-2 రిలీజ్ కు ముందే ఇందులోకి గృహప్రవేశం చేయాలని ఆయన యోచిస్తున్నారు.

దాదాపు రూ.100 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ రాజభవనం హైదరాబాద్ లోని సెలబ్రిటీల అతిపెద్ద సొంత ఇళ్లలో ఇది ఒకటి కానుందని తెలుస్తోంది. ఇందులోనే తన కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేసుకోనున్నారని చెబుతున్నారు. అత్యంత విలాసవంతంగా, అత్యంత ఖరీదైన హంగులతో ఈ ఇంటిని నిర్మిస్తున్నట్టు తెలుస్తోంది. రెబల్ స్టార్ కృష్ణంరాజు ఇంటికి సమీపంలో ఈ ఇల్లు నిర్మిస్తున్నారు. తన అభిమానులను కలుసుకోవడానికి వీలుగా ఓ పెద్ద గదిని కూడా నిర్మిస్తున్నారు.

This website uses cookies.