poulomi avante poulomi avante

హైదరాబాద్లో అమెజాన్ భారీ పెట్టుబడులు

  • 2030 నాటికి 36,300 వేల కోట్ల పెట్టుబ‌డి
  • వెల్లడించిన అమెజాన్
  • అమెజాన్ ఈవెంట్లో కేటీఆర్

అమెజాన్ వెబ్ సర్వీసెస్ విస్తరణ, అదనపు పెట్టుబడి ప్రకటనను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు స్వాగతించారు. అమేజాన్ వెబ్ సర్వీసెస్ ఏషియా పసిఫిక్ రీజియన్ కేంద్రంగా ఉన్న హైదరాబాద్లో 2030 నాటికి 36 వేల 300 కోట్ల రూపాయలను పెట్టుబడిగా అమేజాన్ సంస్థ పెట్టడంపై కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. హెచ్ఐసీసీలో జరిగిన అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఎంపవర్ ఇండియా ఈవెంట్‌లో దావోస్ నుంచి వీడియో కాన్ఫరెన్సులో మంత్రి కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. అమెజాన్ సంస్థ భారీ పెట్టుబడులతో డేటా సెంటర్ ప్రధాన కేంద్రంగా తెలంగాణ మారుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అమెజాన్ విస్తరణ ప్రణాళికలకు తమ సంపూర్ణ సహకారం ఉంటుందన్నారు.

ఇండియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ వినియోగదారులకు అత్యుత్తమ క్లౌడ్ సేవలను అందించాలన్న లక్ష్యంలో భాగంగా హైదరాబాద్‌ చందన్‌వేలి, ఫ్యాబ్ సిటీ, ఫార్మా సిటీలో మూడు డేటా సెంటర్ల‌ను అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఏర్పాటుచేసింది. ఈ మూడు డేటా సెంటర్ల‌ మొదటి దశ పూర్తి అయ్యి.. వినియోగదారులకు పూర్తి స్థాయిలో క్లౌడ్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈ మూడు డేటా సెంటర్లలో మొదట (2020 సంవత్సరంలో) 20 వేల 96 కోట్ల రూపాలయను పెట్టుబడిగా పెట్టాలని అమెజాన్ తొలుత భావించింది. అయితే విస్తరణ ప్రణాళికలు, వ్యాపార వ్యూహాల్లో భాగంగా దశల వారీగా 36 వేల 300 కోట్లను పెట్టుబడిగా పెట్టాలని అమెజాన్ తాజాగా నిర్ణయించింది. అమెజాన్ సంస్థకు పెట్టుబడుల గమ్యస్థానంగా ముందు నుంచి హైదరాబాద్ ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద వెబ్ సర్వీసెస్ క్యాంపస్తో పాటు ఫుల్ ఫిల్మెంట్ సెంటర్ లు హైదరాబాద్లోనే అమెజాన్ ఏర్పాటు చేసింది.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles