Categories: Celebrity Homes

మా ఇంటి గురించి వర్ణించడం కష్టం

  • రియల్ ఎస్టేట్ గురుతో ఆనంద్ దేవరకొండ

ఆనంద్ దేవరకొండ ఇల్లు కేవలం నివసించడానికి వీలైన ఒక ప్రదేశం మాత్రమే కాదు. అది అతడి సూపర్ స్టార్ సోదరుడు విజయ్ దేవరకొండతో పంచుకున్న నవ్వులు, కన్నీళ్లతో కూడి ఉంటుంది. అంతేకాకుండా వారి తల్లిదండ్రులు సృష్టించిన అందాలను ప్రతిబింబిస్తుంది. ఇల్లంటే అంతే కదా? దేవరకొండలు హైదరాబాద్ లోని వారి అందమైన నివాసాన్ని బాగా ఇష్టపడతారు. అది వారికి చాలా విలువైనది. పైగా ఎవరైనా టాలీవుడ్ సెలబ్రిటీ ఇల్లయితే అది కాస్త ప్రత్యేకంగా ఉంటుంది. ఆనంద్ దేవరకొండ తమ ఇల్లు ఎలా ఉంటుందో ‘రియల్ ఎస్టేట్ గురు’తో పంచుకున్నారు.

‘మాకు ఫిలింనగర్ లో అందమైన బంగ్లా ఉంది. నేను ఇక్కడ నా తల్లిదండ్రులు, అన్నయ్య విజయ్, ఇంకా మా హస్కీ శునకం స్టార్మ్ తో కలిసి నివసిస్తున్నాను. ఇది బహుళ అంతస్తుల తెల్లటి భవనం. మా అన్నయ్య దానిని చాలా పెద్ద ప్రదేశంగా భావించడం వల్ల కొన్నిసార్లు అది అతడిని భయపెడుతుంది కూడా’ అని ఆనంద్ వెల్లడించారు. ఒకేసారి నాలుగు సినిమాలకు సంతకం చేసిన నేపథ్యంలో ఆనంద్ చాలా ఉల్లాసంగా ఉన్నారు. ఇక లగ్జరీ గురించి వివరిస్తూ.. ఇంట్లోని డెకర్ అంతా తమ సోదరుల ఆకాంక్షలకు అనుగుణంగా ఉంటుందని తెలిపారు. ‘ఇంటీరియర్ ఎక్కువగా తెలుపు రంగులో ఉంటుంది. గోడలపై ప్రకాశవంతమైన పసుపు రంగు కర్టెన్లు ఉంటాయి. మేం తరచుగా కార్ రేసింగ్ గేమ్ ఆడే ఫ్లాట్ స్క్రీన్ టీవీ వైపు ఫర్నిచర్ అమర్చి ఉంటుంది. ఇక టీవీ పైన ఉండే షెల్ఫ్ మొత్తం విజయ్ గెలుచుకున్న వివిధ అవార్డులతో నిండి ఉంటుంది’ అని పేర్కొన్నారు.

వరకొండలది అటు గ్రాండ్ గా ఇటు సింపుల్ గా కనిపించే చక్కటి నివాసం. వారి గదిలో ముదురు బూడిద రంగులో కనిపించే కుర్చీలు కళాత్మక వ్యక్తీకరణను ప్రతిబింబిస్తాయి. ‘ఇండోర్ ప్లాంట్లతో కలర్ పాలెట్ చక్కగా పనిచేస్తుంది. టేబుల్, డోర్లు, ఫ్రేమ్ లతోపాటు పూల కుండీల్లో కూడా డార్క్ వుడ్ యాక్సెంట్లు ఉన్నాయి. పైన వేలాడుతున్న ఫంకీ ఎల్లో లైట్లు మేం ఎంపిక చేసిందే. ఇక మా కిచిన్ ఏరియా చాలా బావుంటుంది. అదంతా చాలా వరకు తెల్లని రంగులో అందంగా మెరుస్తూ ఉంటుంది. కిచెన్ కి ఆనుకుని చిన్న డైనింగ్ ఏరియా ఉంటుంది. అక్కడ రెండు బార్ స్టూల్స్ కూడా ఉంటాయి. మా ఇంట్లో చూడవలసినవి చాలా ఉన్నాయి. వాటన్నింటినీ ఒక్కొక్కటిగా వర్ణించడం కష్టం’ అని ఆనంద్ వివరించారు. ఇంట్లో అందరూ ఉన్నప్పుడు సరదాగా గడపడమే కాకుండా అందమైన టెర్రస్ పై సేద తీరుతుంటారు. చెక్క ఫ్లోరింగ్ తో కూడిన ఆ టెర్రస్ పై కుషన్లతో రూపొందించిన సోఫా ఉంటుంది. అక్కడ నుంచి అద్భుతమైన వీక్షణలు ఆస్వాదిస్తామని చెప్పి ఆనంద్ దేవరకొండ ముగించారు.

This website uses cookies.