- దేశంలో డేటా సెంటర్ విస్తరణకు ప్రణాళికలు
రియల్ ఎస్టేట్ దిగ్గజం అనంతరాజ్ లిమిటెడ్ కు చెందిన సబ్సిడరీ కంపెనీ అనంత రాజ్ క్లౌడ్.. దేశంలో తన డేటా సంటర్ విస్తరణపై దృష్టి సారించింది. ఇందుకోసం ఆరెంజ్ బిజినెస్ తో జత కట్టింది. మనదేశంలోని ఎంటర్ ప్రైజెస్, ప్రభుత్వరంగ సంస్థలకు తన డేటా సెంటర్ వ్యాపారంతోపాటు అనుకూలమైన, సురక్షితమైన, బలమైన క్లౌడ్ సేవలను అందించే లక్ష్యంతో అనంతరాజ్ క్లౌడ్.. అశోక్ క్లౌడ్ పేరుతో క్లౌడ్ ఫ్లాట్ ఫారం ప్రారంభించింది. దీనికి సంబంధించి సాంకేతిక ఫ్రేమ్ వర్క్ రూపొందించడం, స్థానిక డేటా గోప్యత, భద్రతా నిబంధనలను సరైన విధంగా నిర్వహించడం వంటి పనుల కోసం ఆరెంజ్ బిజినెస్ సహాయం కోరింది.
ఈ నేపథ్యంలో ఈ రెండు సంస్థలు కలిసి పనిచేయనున్నాయి. “భారతదేశంలో ఆర్థిక పురోగమనం, భారత ప్రభుత్వం డేటా స్థానికీకరణ కోసం ముందుకు రావడం, డిజిటల్ అవస్థాపనపై సంస్థలు ఆధారపడాల్సిన ఆవశ్యకతను నొక్కి చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆరెంజ్ బిజినెస్‌తో కలిసి సౌకర్యవంతమైన, సురక్షితమైన, స్కేలబుల్ క్లౌడ్ సేవలు అందించడానికి సిద్ధమయ్యాం” అని అనంత్ రాజ్ క్లౌడ్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ గగన్ సింగ్ వ్యాఖ్యానించారు.
కాగా, అనంత్ రాజ్ లిమిటెడ్ భారతదేశం అంతటా 307 మెగావాట్ల డేటా సెంటర్ ఫుట్‌ప్రింట్‌తో సహా దాని క్లౌడ్ కెపాసిటీపై మరింత పెట్టుబడి పెట్టాలని యోచిస్తోంది. “అనంత్ రాజ్ క్లౌడ్‌తో భాగస్వామిగా ఉన్నందుకు సంతోషిస్తున్నాం. దాని పెరుగుతున్న కస్టమర్ బేస్ కోసం అత్యాధునిక క్లౌడ్ సేవలతో పాటు సురక్షితమైన, విశ్వసనీయమైన, భవిష్యత్తు-రుజువు మౌలిక సదుపాయాలను అందించడం, వారి వ్యాపార అవసరాలకు అనుగుణంగా తగిన సేవలు అందిస్తాం’ అని ఆరెంజ్ బిజినెస్ ఇండియా సీఈఓ చలపతి రావు పేర్కొన్నారు.