poulomi avante poulomi avante

డేటా సెంటర్ల విస్తరణలో దూకుడు

  • వచ్చే ఆరేళ్లలో 25 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చే ఛాన్స్
  • మూడు రెట్లు పెరగనున్న సామర్థ్యం

దేశంలో డేటా సెంటర్ల విస్తరణ భారీగా జరుగుతోంది. వచ్చే అయిదారేళ్లలో కొత్తగా 20 నుంచి 25 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం 15.9 మిలియన్ చదరపు అడుగులుగా ఉన్న డేటా సెంటర్ల స్పేస్ 2030 నాటికి 55 మిలియన్ చదరపు అడుగులకు చేరనుందని రియల్ ఎస్టేట్ కన్సల్టింగ్ సంస్థ కొలియర్స్ ఇండియా తన తాజా నివేదికలో పేర్కొంది. క్లౌడ్ కంప్యూటింగ్, ఏఐ, ఐవోటీ వినియోగం పెరుగుతుండటం, వివిధ రంగాల వ్యాప్తంగా డిజిటలీకరణ వేగవంతం అవుతుండటంతో డేటా సెంటర్ల మొత్తం సామర్థ్యాలు మూడు రెట్లు పెరిగి 2030 నాటికి 4.5 గిగావాట్లకు చేరనున్నాయని తెలిపింది.

2018లో 307మెగావాట్లుగా ఉన్న వీటి సామర్థ్యం ఈ ఏడాది ఏప్రిల్ నాటికి సుమారు నాలుగు రెట్లు పెరిగి 1.26 గిగావాట్లకు చేరింది. మరోవైపు డేటా సెంటర్ల పరిశ్రమ మెట్రో నగరాల్లోనే కాకుండా టైర్-2, 3 పట్టణాలకు కూడా విస్తరిస్తోంది. విజయవాడ, అగర్తలా, పాట్నా, గువాహటి, సంబల్‌పూర్, గంగాగంజ్‌లాంటి కీలక నగరాల్లో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. కాగా, డేటీ సెంటర్ల విషయంలో ముంబై, చెన్నైల ఆధిపత్యం కొనసాగుతోంది. మొత్తం సామర్థ్యాల్లో మూడింట రెండొంతుల వాటా వీటిదే ఉంటోంది. అత్యధికంగా 41 శాతం వాటాతో ముంబై అగ్రస్థానంలో, 23 శాతంతో చెన్నై రెండో స్థానంలో, 14 శాతం వాటాతో ఢిల్లీ ఎన్‌సీఆర్ మూడో స్థానంలో ఉన్నాయి.

ముంబై సూపర్..

డేటా సెంటర్ల విషయంలో ముంబై దూకుడు ప్రదర్శిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా నిర్మాణంలో ఉన్న డేటా సెంటర్ల సామర్థ్యంలో ముంబై ఆరో స్థానంలో ఉంది. మొత్తం 97 నగరాల్లో ముంబైకి ఆరో స్థానం దక్కింది. లండన్, డబ్లిన్ వంటి ప్రధాన హబ్ లను సైతం అధిగమించింది. ఈ మేరకు వివరాలను కుష్ మన్ అండ్ వేక్ ఫీల్డ్ నివేదిక వెల్లడించింది. మరోవైపు ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో (ఏపీఏసీ) అభివృద్ధి చెందుతున్న డేటా సెంటర్ హబ్ లలో పుణె, బెంగళూరు 4, 5వ స్థానాల్లో ఉన్నాయి. 2024 చివరి నాటికి ముంబైలో 335 మెగావాట్ల సామర్థ్యంతో కూడిన డేటా సెంటర్లు నిర్మాణంలో ఉన్నాయి. ఈ విషయంలో 1,834 మెగావాట్ల సామర్థ్యంతో వర్జీనియా మొదటి స్థానంలో ఉంది.

తరువాత అట్లాంటా (1,078 మెగావాట్లు), కొలంబస్ (546 మెగావాట్లు), డల్లాస్ (500 మెగావాట్లు), ఫీనిక్స్ (478 మెగావాట్లు) ఉన్నాయి. దేశంలో అంచనా వేసిన నిర్మాణ సామర్థ్యంలో ముంబై 42 శాతం వాటా కలిగి ఉంది. ఇది దేశంలో డేటా సెంటర్ హబ్ గా ముంబైకి పెరుగుతున్న ప్రాధాన్యతను నొక్కిచెబుతోంది. ఇక ఏపీఏసీ విషయానికి వస్తే.. డేటా సెంటర్ హబ్ లలో పుణె, బెంగళూరు 4, 5వ స్థానాల్లో ఉన్నాయి. నిరంతరాయంగా క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పనిభారాల విస్తరణ కారణంగా గ్లోబల్ డేటా సెంటర్ మార్కెట్లు డిమాండ్‌ను పెరుగుతున్నాయి. డేటా సెంటర్ పరిశ్రమ 2024లో గణనీయమైన వృద్ధిని సాధించింది. ఆసియా పసిఫిక్ నగరాలు బలమైన వృద్ధి వేగాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నాయి.  ప్రపంచంలోని 30 అతిపెద్ద డేటా సెంటర్ మార్కెట్లలో 10 ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ఉన్నాయి.

spot_img
Hallmarkinfracon imperia

Hot Topics

Related Articles