ప్రపంచంలోని వర్క్ స్పేసెస్ లో అత్యధిక నెట్ వర్క్ కలిగిన ‘అప్ ఫ్లెక్స్ ’తో అనరాక్ ఒప్పందం కుదుర్చుకుంది. దీని ద్వారా భారతదేశంలోని ప్రథమ, ద్వితీయ, తృతీయ శ్రేణీ నగరాల్లోని వర్క్ స్పేస్లలో ఆధునిక సేవల్ని అందజేస్తుంది. ’’ప్రస్తుతం భారతదేశం కరోనా మహమ్మారిని ఎదుర్కొంటున్న నేపథ్యంలో అప్ ఫ్లెక్స్ తాజా పరిస్థితులకు తగ్గట్టుగా వర్క్ స్పేస్ సేవల్ని అందిస్తుందని అనరాక్ ఛైర్మన్ అనూజ్ పూరి తెలిపారు.
రియల్ ఎస్టేట్ రంగాన్ని మెరుగుపర్చడం, అనవసర ఖర్చుల్ని తగ్గించడం, వనరుల్ని పొదుపుగా వాడటం మరియు ఉద్యోగి అనుభవాన్ని మెరుగుపరచడం వంటి వాటిలో అప్ ఫెక్స్ కు మంచి అనుభవం ఉంది. దీని ద్వారా తక్కువ-టచ్, సింగిల్-వెండర్ ప్రత్యామ్నాయంతో లీజింగ్ మోడల్స్ ను అందజేస్తుంది. ఈ యాప్ ద్వారా 75 దేశాల్లోని 1600 నగరాల్లో వందలాది వర్క్ స్పేస్ వివరాల్ని తెలుసుకోవచ్చు. వారికి నచ్చిన చోట డెస్కును బుక్ చేసుకోవచ్చు. ‘‘అనరాక్’’తో కలిసి పని చేస్తున్నందుకు ఆనందంగా ఉందని అప్ ఫ్లెక్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ క్రిస్టఫర్ గార్నియర్ తెలిపారు. భారతదేశంలో తమ సేవల్ని అందిస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు.
This website uses cookies.