వర్క్ ఫ్రమ్ వల్ల ఆఫీసు స్పేస్ మార్కెట్ కనీసం నలభై శాతం దెబ్బతింటుందని ఇండియా రేటింగ్స్ అండ్ రిసెర్చ్ ఏజెన్సీ తెలియజేసింది. దీని వల్ల కొత్త ఆఫీసు సముదాయాల్ని లీజుకు ఇచ్చేందుకు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందని వివరించింది. యాక్సెంచర్ సంస్థ నిర్వహించిన సర్వేలో దాదాపు 83 శాతం ఉద్యోగులు 25 నుంచి 75 శాతం సమయం హైబ్రిడ్ మోడల్ కు మొగ్గు చూపారు. దీని వల్ల ఆఫీసు స్పేస్ మార్కెట్ కు దారుణమైన దెబ్బ పడుతుంది. హాట్ డెస్కింగ్ పాలసీని కంపెనీలు ప్రవేశపెట్టడం వల్ల ఆఫీసు స్థలానికి గణనీయంగా గిరాకీ తగ్గుతోంది.
* భారతదేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో 63.5 కోట్ల చదరపు అడుగుల ఆఫీసు సముదాయం ఉంది. ఇందులో కనీసం 80 లక్షల ఆఫీసు స్పేస్ కి గిరాకీ తగ్గవచ్చు. ఇప్పటికే అనేక అంతర్జాతీయ సంస్థలు హై బ్రిడ్ తరహాలో పని చేసేందుకు అంగీకరించాయి. ఉద్యోగులు కొన్ని రోజులు మాత్రమే వచ్చి ఆఫీసులో పని చేయాలని చెబుతున్నాయి. ఈ క్రమంలో ఆఫీసు స్థలానికి కొంత డిమాండ్ తగ్గే మాట వాస్తవమేనని చెప్పొచ్చు.
This website uses cookies.