(కింగ్ జాన్సన్ కొయ్యడ)
ఆధునిక ఆవిష్కరణల ద్వారా రియాల్టీ రంగాన్ని కొత్త పుంతల్ని తొక్కిస్తూ.. టెక్నాలజీని ఉపయోగించుకుని భారత రియల్ రంగంలో సరికొత్త మార్పుల్ని తేవడంలో అనరాక్ సంస్థ క్రియాశీలక పాత్రను పోషిస్తోంది. విభిన్నమైన ఆసక్తుల్ని కలిగి ఉన్న భారత రియల్ సేవల సంస్థల్లో ప్రముఖంగా నిలుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో రియల్ రంగం తారాస్థాయికి చేరుకున్న తరుణంలో.. మార్కెట్ స్థితిగతుల్ని విశ్లేషించడంలో అనరాక్ మించిన సంస్థ ఉంటుంది చెప్పండి. అందుకే, ఈ వారం రెజ్ న్యూస్.. అనరాక్ సంస్థ ఛైర్మన్ అనూజ్‌పూరిని ప్రముఖంగా కలిసింది. హైదరాబాద్‌లోని రియల్ ఎస్టేట్‌పై ప్రపంచ మాంద్యం ప్రభావం, పెరుగుతున్న ఆకాశహర్మ్యాలు, మార్కెట్‌లోకి ప్రవేశించిన కొత్త రియల్టీ కంపెనీలు వంటి అంశాలపై సంభాషించింది. మరి, ఇంటర్వ్యూలోని సారాంశమిదే..
జ: ఇది చాలా ఆసక్తికరమైన ప్రశ్న. రెసిడెన్షియల్ వైపు ఈ రంగం చాలా బాగా కొనసాగుతోంది. కోవిడ్ తగ్గుముఖం పట్టడంతో, రెసిడెన్షియల్ ప్రాపర్టీలలో మళ్లీ డిమాండ్ ఏర్పడింది. భారతదేశం అంతటా మార్కెట్ స్థిరంగా కొనసాగుతుంది. హైదరాబాద్‌లో అన్ని స్థాయిలో ఇళ్లకు గిరాకీ నెలకొంది. హైదరాబాద్‌లో ఉన్న ఏకైక ఏకైక సమస్య భూమి ధర. ఇళ్ల అమ్మకపు ధరలు భూమి రేట్లతో సమానంగా పెరగట్లేదు. మొత్తం మీద హైదరాబాద్ రియల్ రంగంలో భారతదేశంలోనే మెరుగైన పనితీరు కనబరుస్తోంది.
ప్రపంచ ఆర్థిక మందగమనం నేపథ్యంలో.. వాణిజ్య రంగంలో ఏమి జరుగుతోందనే ప్రశ్న తలెత్తుతోంది. ఆర్థిక మాంద్యం కారణంగా ప్రపంచ దేశాల్లో కార్పొరేట్ సంస్థలు అధిక స్థలాన్ని తీసుకోవట్లేదు. ఎందుకంటే, అధిక శాతం మంది ఇంకా ఆఫీసులకు రావడం ఆరంభించలేదు. ఎందుకంటే, వారంతా ఇంటి నుంచే పని చేస్తున్నారు. యూరప్ ప్రజలు ఆఫీసుకొచ్చి పని చేస్తున్నారు. హాంకాంగ్, సింగపూర్, ఇండియా వంటి దేశాల్లో అధిక శాతం మంది ఉద్యోగులు ఆఫీసులకు వెళుతున్నారు. అమెరికా ప్రజలే ఇంకా వర్క్ ఫ్రమ్ చేస్తున్నారు. ఫ్రంట్ ఆఫీసు ఉద్యోగులైతే పని చేస్తున్నారు. కాకపోతే, ఐటీ ఉద్యోగులే వారానికి మూడు లేదా నాలుగు రోజులు పని చేస్తున్నారు. కాకపోతే బడా ఐటీ పార్కుల్లో పని చేసే ఉద్యోగులు క్రమం తప్పకుండా ఆఫీసులకు వెళుతున్నారు. అయితే, ప్రపంచ ఆర్థిక మాంద్యం కారణంగా మార్కెట్లో మందగమనం ఏర్పడటం అధిక ప్రభావాన్ని కనబరుస్తోంది. అయితే, మన ఇండియాలో పరిస్థితి కాస్త మెరుగని చెప్పొచ్చు.
అనేక సంస్థలు మన దేశంలోకి అడుగుపెట్టాయి. నేను వాటికి మూడు రకాలుగా విభజించాను. ఫార్మా వల్ల హైదరాబాద్ గణనీయంగా ప్రయోజనం పొందుతోంది. ఇందులోని అనేక పరిశోధన సంస్థలు హైదరాబాద్‌కు విచ్చేయడానికి ప్రథమ ప్రాధాన్యతను ఇస్తున్నాయి. మందుల ఉత్పత్తి సంస్థలు, పరిశోధన కంపెనీలు వంటివి ఆసక్తి చూపిస్తున్నాయి. రెండోది, ఆర్థిక సంస్థల్లో ముఖ్యంగా బడా అమెరికా, యూరప్ బ్యాంకులు ఇక్కడికి విచ్చేస్తున్నాయి. మూడోది, టెక్నాలజీ సంస్థలు మనవైపు ఆసక్తిగా చూస్తున్నాయి.
ఇంకా ప్రభావం అయితే పడలేదు. డిమానిటైజేషన్ సమయంలో కొంత సమస్యల్ని చూశాం. ఇప్పుడైతే అలాంటి సమస్యలేం కనిపించట్లేదు.
వెయ్యి చదరపు అడుగుల ఆఫీసు స్పేస్‌ను ఒక సంస్థ తీసుకుంటే.. ఒక వ్యక్తికి 100 చదరపు అడుగుల స్థలం అవసరం అవుతుంది. అంటే, లక్ష చదరపు అడుగుల్లో ఒక కంపెనీ వెయ్యి మంది ఉద్యోగులను తీసుకుంటే.. అందులో కనీసం యాభై శాతం మందిని లెక్కించినా, ఐదు వందల మంది ఇళ్లను తీసుకుంటారు.
హైదరాబాద్‌లోకి అడుగుపెట్టడానికి అనేక మంది భారతీయ డెవలపర్లు ఆసక్తి చూపిస్తున్నారు. గతంలో ఎక్కువగా దక్షిణాది సంస్థలే ఎక్కువగా దృష్టి సారించేవి. ఉదాహరణకు పుర్వాంకర, ప్రెస్టీజ్, బ్రిగ్రేడ్, శోభా వంటివి ఆసక్తిని చూపించేవి. కానీ, ప్రస్తుతం ముంబైకి చెందిన డెవలపర్లు భాగ్యనగరంలోకి అడుగుపెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. రహేజా, లోదా, గోద్రెజ్ వంటివి ఇందుకు ఉదాహరణలుగా చెప్పొచ్చు.
హైదరాబాద్ ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్. ఎంతో లోతైన మార్కెట్. గిరాకీని కొనసాగించిన మార్కెట్ అని చెప్పొచ్చు. హైదరాబాద్‌ను రాత్రివేళలో చూస్తే.. న్యూయార్క్ తరహా కనిపిస్తుంది. ఇక్కడి ఆకాశహర్మ్యాలు, లైట్లు, అందమైన భవనాలు, వాటి బయటి ప్రాంతం వంటివి చూస్తే మన్‌హట్టన్‌లో ఉన్నామా అనిపిస్తుంది. ఇప్పట్నుంచి ఓ ఐదేళ్ల తర్వాత భాగ్యనగరానికి చూస్తే గనక.. అంతర్జాతీయ నగరంగా ఖ్యాతినార్జిస్తుంది. ఇక్కడి మౌలిక సదుపాయాలు, మ్యాన్ పవర్, రియల్ ఎస్టేట్ వంటివాటిలో నాణ్యత కనిపిస్తుంది. దేశంలోని ఇతర నగరాలతో పోల్చితే, హైదరాబాద్ ఇంకా అందుబాటులోనే ఉందని చెప్పొచ్చు. ఈ నగరానికి నేను గొప్ప అభిమానిని. వచ్చే ఐదేళ్లలో మరింత అభివృద్ధి సాధ్యమవుతుంది.
జ: ఈ నగరానికి అనేక సానుకూలాంశాలున్నాయ. ముందుగా ఇక్కడ నాణ్యమైన ట్యాలెంట్ దొరుకుతుంది. అందుకే, అనేక మంది ఈ నగరానికి వలస వస్తున్నారు. ఇతర నగరాలకు చెందిన అనేక మంది యువత హైదరాబాద్‌లోకి అడుగుపెడుతున్నారు. రెండోది, ఇక్కడి మౌలిక సదుపాయాలు మెరుగ్గా ఉన్నాయి. ఎయిర్‌పోర్టు, రోడ్లు, మెట్రో, సెక్యూరిటీ వంటివి మెరుగ్గా ఉన్నాయి. మూడోది, ఇతర నగరాలతో పోల్చితే ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా తక్కువ. ఈ మూడు అంశాల్ని అంతర్జాతీయ సంస్థలు గమనిస్తాయి. ఇక్కడ మెరుగైన ఆస్పత్రులున్నాయి. వినోద కేంద్రాలున్నాయి. విద్యాసంస్థలకు కొదవే లేదు. కాలేజీలు, హోటళ్లు, రిటైల్ మాళ్లు.. ఇలా చూస్తే హైదరాబాద్ నగరానికి అనేక సానుకూలతలు ఉన్నాయని చెప్పొచ్చు.
జ: నేను రెరాకు పెద్ద మద్దతుదారుడిని. నిజంగా చెప్పాలంటే రెరా ఎంతో శుభ్రం చేస్తోంది. రియల్ పరిశ్రమలో కొందరు వ్యక్తులు చేసే తప్పుల్ని రెరా పూర్తిగా తొలగించేస్తోంది. కొన్ని రాష్ట్రాల్లో రెరా ఎంతో పరిణితి చెందింది. మహారాష్ట్ర రెరా వల్ల అక్కడి మార్కెట్ వృద్ధి చెందింది. అక్కడ పారదర్శకత పెరిగింది. కొన్ని నెలల్లోనే.. అక్కడి ఇళ్ల కొనుగోలుదారులకు ఎంతో నమ్మకం పెరిగింది.
మాది కొత్తతరహా రియల్ ఎస్టేట్ సర్వీసెస్ సంస్థ. టెక్నాలజీ, డిజిటిల్ ద్వారా ఎక్కువగా రెసిడెన్షియల్ మార్కెట్ మీద దృష్టి పెట్టాం. ఏటా మనదేశంలో 21 వేల ఇళ్లను విక్రయిస్తాం. డెవలపర్లు స్థల సేకరణకు అవసరమయ్యే డెట్, ఈక్విటీని అందించేందుకు తోడ్పాటునిస్తాం. స్థల విలువ నిర్థారణ, మెరుగైన భూవినియోగం చేసేందుకు తోడ్పాటునిస్తాం. మాళ్లు, హోటళ్లు, ఆఫీసు స్థల విక్రయం, లీజుకు తోడ్పాటునిస్తాం. హైదరాబాద్ రెసిడెన్షియల్ విభాగం మాకో స్పెషల్ మార్కెట్. ఆధునిక ఆవిష్కరణల్ని ఇక్కడ ప్రవేశపెట్టాం. ఇండస్ట్రీయల్, వేర్‌హౌసింగ్, లాజిస్టిక్స్, ఆఫీసు విభాగంలోనూ మేం సేవల్ని అందిస్తున్నాం.
This website uses cookies.