గాడ్జెట్ టూ గార్డెన్ థీమ్.. 75 శాతం లష్ గ్రీనరీ ఓపెన్ స్పేసెస్.. ఫ్రూట్ ఆర్చిడ్స్ నుంచి అరోమా గార్డెన్స్ వరకు ఎటు చూసినా రకరకాల ఉద్యానవనాలు. విలాసానికి అసలైన నిర్వచనంలా ఉండే లగ్జరీ విల్లాలూ. తాము మాత్రమే ఆలోచించి. . తమ ప్రాజెక్ట్‌కి మాత్రమే సొంతమైన ఆరు అసాధారణ ప్రత్యేకతలు. అన్వితా గ్రూప్ కొత్త ప్రాజెక్ట్ పార్క్‌సైడ్ ఎలా ఉండబోతుందో చెప్పడానికి స్మాల్ ఇంట్రడక్షన్ ఇది. మనసుని ఆహ్లాదపర్చే ప్రకృతి- పచ్చదనానికే మొదటి ప్రాధాన్యత కనిపిస్తుంటుంది పార్క్‌సైడ్ ప్రాజెక్ట్‌లో. వీటి అన్నింటితో పాటు దేశంలోనే మొట్టమొదటిసారిగా ఫ్రంట్ అండ్ బ్యాక్ యార్డ్ విల్లా కాన్సెప్ట్‌ను హైద్రాబాద్‌కి పరిచయం చేస్తోంది అన్వితా గ్రూప్.
అన్వితా గ్రూప్- హైద్రాబాద్ రియాల్టీ రంగంలో ఈ పేరు ఓ సంచలనం. ట్రెండ్‌కి తగ్గట్టు నిర్మాణాలు చేపట్టడం కాదు- ట్రెండ్ సెట్టింగ్ కాన్సెప్ట్స్‌తో బయ్యర్లకు సరికొత్త ఎక్స్‌పీరియన్స్.. కాన్‌టెంపరరీస్‌కి గట్టి పోటీ ఇస్తోంది ఈ సంస్థ. చేపట్టిన ప్రతీ ప్రాజెక్ట్‌లో వైవిధ్యం.. ఇన్నోవేటివ్ ఐడియాస్ అన్వితా గ్రూప్‌ను స్పెషల్‌గా నిలబెడుతున్నాయ్. ఆ కంపెనీ నుంచి మేడ్చల్ సమీపంలోని రావల్‌కోల్‌లో 50 ఎకరాల్లో రాబోతున్న మరో సెన్సేషన్ ప్రాజెక్ట్- పార్క్‌సైడ్. ఈ ఎకో ఫ్రెండ్లీ విల్లామెంట్స్‌లో ఫస్ట్ చెప్పుకోవాల్సిన హైలెట్ పాయింట్- ఫ్రంట్ అండ్ బ్యాక్ యార్డ్ విల్లా కాన్సెప్ట్. ఈ తరహా ఆలోచనతో దేశంలో నిర్మితమవుతోన్న మొట్ట మొదటి విల్లా ప్రాజెక్ట్ ఇదే.
పచ్చదనాన్ని తీసుకొచ్చి నివాస సముదాయాల మధ్యలో సెట్ చేసినట్టుండే పార్క్‌సైడ్‌లో లావిష్ విల్లామెంట్స్‌ని నిర్మిస్తున్నారు. ఈ విల్లాలకు 20 అడుగుల ఫ్రంట్ అండ్ బ్యాక్ యార్డ్స్ ఉంటాయ్. రిలాక్స్ అవడానికి, వినోదం, వర్క్‌స్పేస్, హోమ్ ఆఫీస్, గార్డెనింగ్.. తమ అభిరుచికి తగ్గట్టు ఎలా కావాలంటే అలా వినియోగించుకోవచ్చు వీటిని. ఫోర్ బీహెచ్‌కే టైప్‌లో రానున్న ఈ ట్రిప్లెక్స్ విల్లాస్ ఈస్ట్, వెస్ట్, నార్త్ ఫేసింగ్స్‌లో అందుబాటులో ఉంటాయ్. ఇక డైమన్షన్స్ చూస్తే- ఫేసింగ్‌ను బట్టి 4 వేల 188 నుంచి 4 వేల 201 చదరపు అడుగుల్లో వీటిని నిర్మిస్తున్నారు. విల్లాలోని ప్రతీ లివింగ్ స్పేస్‌ను బయ్యర్ల అభిరుచికి అనుగుణంగా కస్టమైజ్ చేసి ఇవ్వడం పార్క్‌సైడ్ ప్రాజెక్ట్‌లో మరో ప్రత్యేకత.
మేడ్చల్ నుంచి ఎలా ట్రావెల్ చేసినా అరగంటలోనే చేరుకోవచ్చు రావల్‌కోల్‌కు. ప్రకృతి ఒడిలో లగ్జరీ లైఫ్‌స్టైల్‌ను ఎంజాయ్ చేస్తూ ఫస్ట్‌క్లాస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్.. హై ఎండ్ నైబర్‌హుడ్స్ కావాలనుకునే వారికి బెస్ట్ ఆప్షన్ అన్వితా పార్క్‌సైడ్. మేడ్చల్‌కు అతి సమీపంలో ఉండటం ఈ ప్రాజెక్ట్‌కి కలిసొచ్చే అంశం. లొకేషన్ హైలెట్స్ చూస్తే.. ఐదు నిమిషాల డ్రైవ్ అవేలో మెడిసిటీ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్.. రాజీవ్ రహదారి రోడ్ ఉండగా.. 10 నిమిషాల డ్రైవ్‌తో ఓఆర్‌ఆర్ ఎగ్జిట్ నంబర్ ఆరు- ఓఆర్‌ఆర్ ఎగ్జిట్ నంబర్ ఏడుని చేరుకోవచ్చు. అలాగే మేడ్చల్ చెక్‌పోస్ట్, షామీర్‌పేట్ లేక్, లియోనియా, అలంక్రితా, సెలబ్రిటీ రిసార్ట్స్, కండ్లకోయలో ప్రపోజల్స్‌లో ఉన్న ఐటీ పార్క్ కూడా 10 నిమిషాల్లో రీచ్ అయ్యేంత దగ్గరే. వీటితో పాటు పార్క్‌సైడ్ ప్రాజెక్ట్ నుంచి జీనోమ్‌వ్యాలీకి సైతం 15 నిమిషాల్లోనే వెళ్లొచ్చు.
మెట్రో రైల్ రెండో దశ విస్తరణ ప్రణాళికలో ప్యారడైజ్- మేడ్చల్, జేబీఎస్- షామీర్‌పేట్ రూట్స్ ఉన్నాయ్. అంటే- పార్క్‌సైడ్ ప్రాజెక్ట్‌కి భవిష్యత్‌లో మెట్రో సౌలభ్యం కూడా ఉండనుంది. ఇక నియర్ బైలో ఉన్న ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూట్స్‌ని చూస్తే- ఐవీ లీగ్ స్కూల్, గీతాంజలి ఇంటర్నేషల్ స్కూల్, ఎక్సలెన్సియా ఇన్ఫినిటమ్ స్కూల్, నల్సార్ యూనివర్శిటీ, మల్లారెడ్డి యూనివర్శిటీ, శివ శివాని ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ లాంటి ప్రొఫెషనల్ కాలేజెస్ ఉన్నాయ్. వీటితో పాటు చుట్టు పక్కల హాస్పిటల్స్, ఆఫీస్‌లు, మాల్స్, రెస్టారెంట్స్, గ్రాసరీ, బ్యాంక్స్ లాంటి వాటికి ఢోకా లేదు.
అన్వితా పార్క్‌సైడ్ ప్రాజెక్ట్‌లో ప్రతీ అంగుళం ప్రత్యేకమే. వాటిల్లో స్పెషల్‌గా మెన్షన్ చేయాల్సింది 33 వేల చదరపు అడుగుల్లో ప్లాన్ చేసిన క్లబ్‌హౌస్ గురించి. రిసార్ట్ మోడల్‌లో డిజైన్ చేసిన ఈ క్లబ్‌హౌస్ స్ట్రెస్‌ఫుల్ లైఫ్‌కి రీఫ్రెష్ బటన్‌లా ఉంటుంది. కన్సల్టేషన్ రూమ్, జిమ్ అరెనా, యోగా, బాంక్వెట్ హాల్, రెస్టారెంట్, స్పా, ఇండోర్ గేమ్స్, గెస్ట్ రూమ్స్, కన్వినెంట్ స్టోర్ లాంటి వసతులున్నాయ్. 2.5 ఎకరాల విస్తీర్ణమున్న ఇందులో 178 కార్ పార్కింగ్ స్లాట్స్.. 148 టూ వీలర్ పార్కింగ్ స్లాట్లు ఉన్నాయ్. అలాగే గాడ్జెట్స్ టూ గార్డెన్ అంటూ ప్రకృతితో వీలైనంత గడిపేలా ఉంటాయి పార్క్‌సైడ్‌లో అమెనిటీస్. 35 ఎకరాలకి పైగా న్యాచురల్ ఓపెన్ స్పేసెస్ కోసం కేటాయించారు.
ఔషధ మొక్కల గార్డెన్, ట్రెల్లీస్, అరోమా గార్డెన్, కూరగాయలు, పండ్లతో పాటు వివిధ రకాల వ్యవసాయ ఉత్పత్తుల్ని ఒకేచోట సాగు చేసుకునే అవకాశమున్న మండల ఫార్మింగ్, ఫ్రూట్ ఆర్చిడ్స్, రెయిన్ గార్డెన్, వెజిటబుల్ బెడ్స్ ఉన్నాయ్. కేవలం కమ్యూనిటీ ఫార్మింగ్ కోసమే 3.2 ఎకరాల్ని రిజర్వ్ చేశారు. వీటి వల్ల ఔట్‌డోర్‌లో ఎక్కువ సమయం కేటాయించడంతో పాటు ప్రకృతితో మమేకమవ్వొచ్చు. విజిటర్స్ కోసం డెడికేటెడ్ కార్ పార్కింగ్ ఏరియా ఉంది. ఇక్కడ ఒకేసారి 200 మంది విజిటర్ల కార్స్ పార్కింగ్ చేయొచ్చు.
మియావాకీ ఫారెస్ట్, బర్డ్స్ వాచ్ టవర్, టెంపుల్ కాంప్లెక్స్, అడ్వెంచర్ ప్లే ఏరియా, యాంఫిథియేటర్, గాజిబో, పెట్స్ కోసం ప్రత్యేక పార్క్, టెన్నిస్ కోర్ట్, వాలీబాల్ కోర్ట్, హాఫ్ బాస్కెట్‌బాల్ కోర్ట్, డైన్ స్పేసెస్, సీటింగ్ స్పేసెస్, క్రికెట్ ప్రాక్టీస్ నెట్స్, స్విమ్మింగ్‌పూల్ ఇలా సకల సదుపాయాలున్నాయి ఇందులో. ఓపెన్ స్పేస్‌లో రిసార్ట్ తరహాలో కల్పిస్తోన్న ఇలాంటి అమెనిటీస్ అన్వితా పార్క్‌సైడ్‌లో మినహా ఎక్కడా లేవు.. రాబోవంటోంది కంపెనీ యాజమాన్యం.
35 ఎకరాల్లో ఓపెన్ అండ్ ల్యాండ్‌స్కేప్డ్ ప్లేస్‌లు
కమ్యూనిటీ ఫార్మింగ్ కోసం 3.2 ఎకరాలు రిజర్వ్
విజిటర్ల కోసం ప్రత్యేకంగా కార్ పార్కింగ్ స్పేస్
200 కార్లు పార్కింగ్ చేసే సౌలభ్యం
ఔట్‌డోర్ స్పోర్ట్స్‌తో కలిపి 75 రకాల అమెనిటీస్
33,005 చ.అ. విస్తీర్ణంలో క్లబ్‌హౌస్
2.5 ఎకరాల్లో రిసార్ట్‌ను తలపించేలా నిర్మాణం
178 కార్ పార్కింగ్ స్లాట్స్
148 టూ వీలర్ పార్కింగ్ స్లాట్స్
సోలార్ పవర్డ్ హోమ్స్
విదేశీ ట్రెండ్స్ ఇక్కడ పరిచయం..
హైద్రాబాద్ రియాల్టీ సెక్టార్లో అడుగు పెట్టిన దగ్గర్నుంచి అంతర్జాతీయ ప్రమాణాల్ని నగరానికి తీసుకురావడమే కాదు.. విదేశాల్లో కనిపించే ఫైన్ ఆర్కిటెక్చర్ అండ్ క్రియేటివిటీని సైతం భాగ్యనగరానికి పరిచయం చేస్తోంది అన్వితా గ్రూప్. ఇంటర్నేషనల్ కాన్సెప్ట్స్.. అబ్బురపర్చే డిజైన్స్.. వావ్ అనిపించేలా రూపొందించే ల్యాండ్ స్కేప్స్‌తో ఎక్స్‌ట్రార్డనరీగా ఉంటాయి అన్వితా గ్రూప్‌కి చెందిన ప్రీమియం లగ్జరీ ప్రాజెక్ట్‌లు.
అచ్యుతరావు ప్రత్యేకత ఇదే!
సింగపూర్, దుబాయ్‌ల్లో ఇంటీరియర్ బిజినెస్‌తో గుర్తింపు పొందారు అన్వితా గ్రూప్ సీఎండీ బొప్పన అచ్యుతరావు. ఇంటీరియర్‌తో పాటు నిర్మాణ రంగంలోని అనుభవంతో తెలంగాణ రియల్ ఎస్టేట్ రంగంలో అడుగు పెట్టిన ఆయన అన్వితా బిల్డర్స్ పేరుతో భారీ ప్రాజెక్ట్‌ల నిర్మాణాన్ని చేపట్టారు. అన్వితా పార్క్‌సైడ్‌తో పాటు.. టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారి అందరి దృష్టిని ఆకర్షించిన అన్వితా ఇవానా, అన్వితా హై9, అన్వితా కమర్షియల్, అన్వితా అమరి ప్రాజెక్టుల్ని నిర్మిస్తున్నారు. ఇక పార్క్‌సైడ్ విల్లా ప్రాజెక్ట్‌ను ల్యాండ్‌స్పేస్ ప్రాజెక్ట్స్‌తో కలిసి డెవలప్ చేస్తోంది.
అర్బన్ లైఫ్‌స్టైల్ విల్లాస్
పని భారంతో నలిగిపోతున్న వారికి ప్రకృతి మధ్యలో నివసించడమనేది రీసెట్ బటన్ లాంటిది. మరి ఇంటి చుట్టూ గ్రీనరీ ఉండేలా ప్రాజెక్ట్‌ను డిజైన్ చేస్తే..! నేచర్‌తో కలిసుండేలా అర్బన్ లైఫ్‌స్టైల్ విల్లాస్‌ను రూపొందిస్తే..! అంతకు మించిన స్వర్గం ఉండదేమో కదా..! సరిగ్గా ఈ ఆలోచనతోనే పార్క్‌సైడ్ పేరుతో వినూత్న ప్రాజెక్ట్‌ను చేపట్టింది అన్వితా గ్రూప్. పేరులోనే పార్క్‌సైడ్ అని ఉన్నప్పుడు పచ్చదనానికి కేరాఫ్ కాకుండా ఉంటుందా..? ఇక రిసార్ట్‌ను తలపించే క్లబ్‌హౌస్.. పదుల సంఖ్యలో ఉన్న అమెనిటీస్ గురించి ఎంత చెప్పినా తక్కువే.