Categories: LATEST UPDATES

అక్రమ లేఔట్లపై ఏపీ సీఆర్డీఏ ఉక్కుపాదం

తన పరిధిలో వెలసిన అక్రమ లేఔట్లపై ఏపీ క్యాపిటల్ రీజియన్ డెవలప్ మెంట్ అథార్టీ (ఏపీ సీఆర్డీఏ) ఉక్కుపాదం మోపనుంది. అలాంటి డెవలపర్లపై చర్యలకు ఉపక్రమించింది. ఇటీవల వేసిన అక్రమ లేఔట్లకు నోటీసులిచ్చి వాటిని ధ్వంసం చేసే ప్రక్రియను సీఆర్డీఏ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ విభాగం ఇప్పటికే ప్రారంభించింది. మొత్తం 260 అక్రమ లేఔట్లు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. వాటిలో వేసిన రోడ్లతోపాటు చుట్టూ నిర్మించిన ప్రహరీ గోడలను ధ్వంసం చేస్తున్నారు.

‘అక్రమ లేఔట్లు ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నాయి. రెగ్యులర్ లేఔట్లను దెబ్బతీసేందుకు చాలామంది వాటి పక్కనే అక్రమంగా లేఔట్టు వేశారు. సరైన సౌకర్యాలు లేని అలాంటి వెంచర్ల వల్ల మాస్టర్ ప్లాన్ సైతం దెబ్బతింటుంది. అందువల్ల అలాంటివాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నాం’ అని ఏపీ సీఆర్డీఏ కమషనర్ విజయ్ కృష్ణన్ తెలిపారు. అయితే, ఈ చర్యలను అమరావతి క్యాపిటల్ రీజియన్ రియల్టర్స్ అసోసియేషన్ ఖండించింది.

This website uses cookies.