Categories: NEW PRODUCTS

యూరోపియ‌న్ వోక్స్ నుంచి కొత్త ఉత్ప‌త్తులు విడుద‌ల

దాదాపు 1999 నుంచి బిల్డింగ్‌ మెటీరియల్స్‌ మరియు హోమ్‌ ఫర్నిషింగ్‌ ఉత్పత్తులను తయారుచేస్తోన్న యూరోపియన్‌ ఫర్నిచర్‌ కంపెనీ వోక్స్.. భారతదేశంలో సరికొత్త ఉత్పత్తులను విడుదల చేసింది. ఇందులో సోఫ్ఫిట్‌ ఇన్‌ఫ్రాటాప్‌–సృజనాత్మక సీలింగ్‌ సిస్టమ్‌, కెర్రాడెకో – వినూత్నమైన వాల్‌ సిస్టమ్స్‌ – ఇంటీరియర్‌ వాల్‌ క్లాడింగ్‌ కోసం మ్యాక్‌ 3 ఎక్స్‌టర్నల్‌ క్లాడింగ్‌ సిస్టమ్స్‌ మరియు కెర్రాఫ్రంట్‌ ఎక్సటర్నల్‌ క్లాడింగ్‌ సిస్టమ్స్‌ ఉన్నాయి. వీటిని భారతదేశంలో వోక్స్‌ బిల్డింగ్‌ ప్రొడక్ట్స్‌ సేల్స్‌ డైరెక్టర్‌ తొమాస్జ్‌ స్జుత్నిక్‌ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో హరి ప్రసాద్‌ (చీఫ్‌ ఆర్కిటెక్ట్‌, కాస్మో డ్యూరబల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌), వైద్యనాథన్‌, నేషనల్‌ సేల్స్‌ హెడ్‌ (వోక్స్‌), బీఎన్‌ కుమార్‌, రీజనల్‌ మేనేజర్‌ (వోక్స్‌, సౌత్‌ –1) పాల్గొన్నారు.

ఈ సందర్భంగా తొమాస్జ్‌ స్జుత్నిక్‌, సేల్స్‌ డైరెక్టర్‌ (వోక్స్‌ బిల్డింగ్‌ ప్రొడక్ట్స్‌) మాట్లాడుతూ ‘‘నూతన శ్రేణి వినూత్నమైన సీలింగ్‌, వాల్‌, ఫేకెడ్‌ క్లాడింగ్‌ వ్యవస్ధల ఆవిష్కరణ పట్ల చాలా సంతోషంగా ఉన్నాం. ఈ శ్రేణి మరింత చైతన్యాన్ని తీసుకురావడంతో పాటుగా వినూత్నమైన మన్నిక, అతి తక్కువ నిర్వహణ కలిగిన ఇంటీరియర్‌ డెకార్‌ పరిష్కారాలను అందించే వినూత్నమైన లివింగ్‌ స్పేసెస్‌ అందిస్తుంది. వోక్స్‌ వద్ద, మేం అసలైన స్వేచ్ఛ అనేది ఇంటి వద్దనే ప్రారంభమవుతుందని నమ్ముతున్నాం మరియు మన జీవన ప్రాంగణాలను నిర్వహించే విధానం మన జీవితాలపై అధిక ప్రభావం చేస్తుంది. అంతేకాదు, మా ఉత్పత్తులన్నీ కూడా థింకింగ్‌ మెథడాలజీకి అనుగుణంగా ప్రజల వాస్తవ అవసరాలను తీర్చే రీతిలో ఉంటాయి. ఈ శ్రేణితో, భారతదేశంలో ఇంటీరియర్స్‌ను ప్రజలు వినియోగిస్తున్న తీరును విప్లవాత్మీకరించగలమని ఆశిస్తున్నాం’’ అని అన్నారు.

కాస్మో డ్యూరబల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ చీఫ్‌ ఆర్కిటెక్ట్‌ హరి ప్రసాద్‌ మాట్లాడుతూ ‘‘ ఈ నూతన శ్రేణి సీలింగ్‌, వాల్‌ మరియు ఫాకెడ్‌ క్లాడింగ్‌ సిస్టమ్స్‌ కోసం వోక్స్‌తో భాగస్వామ్యం చేసుకోవడం పట్ల చాలా సంతోషంగా ఉన్నాము. మా వినియోగదారులకు ప్రత్యేకమైన, వినూత్నమైన, అతి సులభంగా ఇన్‌స్టాల్‌ చేయగలిగిన మరియు మన్నికైన పరిష్కారాలను అందించడానికి మా జాబితాలో సృజనాత్మక డిజైన్‌ పరిష్కారపు శ్రేణిని స్వాగతిస్తున్నా. వోక్స్‌ పరిచయం చేసిన ఈ నూతన శ్రేణికి అద్భుతమైన స్పందన, ఆమోదం లభిస్తుందని ఆశిస్తున్నాము’’అని అన్నారు.

This website uses cookies.