కరోనా వల్ల అనేక సవాళ్లు ఎదురైనప్పటికీ తమ సంస్థ బలమైన వృద్ధిని కొనసాగించిందని.. హైదరాబాద్‌లో కొత్త ప్రాజెక్టును ప్రారంభించడమే ఇందుకు నిదర్శనమని అపర్ణా కన్‌స్ట్రక్షన్స్ డైరెక్టర్ రాకేశ్ రెడ్డి తెలిపారు. నలగండ్లలో పాతిక ఎకరాల్లో కొత్తగా అపర్ణా జైకాన్ ప్రాజెక్టును ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎనిమిది రెసిడెన్షియల్ ప్రాజెక్టులతో ఈసారి దక్షిణ మార్కెట్లో పలు వాణిజ్య సముదాయాల్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. ఇంకా, ఆయన ఏమన్నారంటే..
” రియల్ రంగం అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని కొత్త ఉద్యోగుల్ని చేర్చుకునే ప్రక్రియను ముమ్మరం చేశాం. ఇప్పటికే ఉన్న ప్రాజెక్టులతో పాటు కొత్త వాటిలో పని చేసేందుకు దాదాపు నాలుగు వందల మందిని కొత్తగా తీసుకునేందుకు ప్రణాళికల్ని రచిస్తున్నాం. హైదరాబాద్‌లో రెసిడెన్షియల్ ప్రాజెక్టుల్లో సానుకూల దృక్పథం ఏర్పడింది. గత కొంతకాలం నుంచి కొత్తగా ఫ్లాట్లను కొనేవారి సంఖ్య పెరుగుతోంది. లాక్ డౌన్ తొలగించిన తర్వాత మార్కెట్ క్రమక్రమంగా పుంజుకుంటోంది. ఈఏడాది డిమాండ్ మరింత పుంజుకుంటుందని భావిస్తున్నాను.
ఈ ఏడాదిలో దాదాపు కొత్తగా ఎనిమిది ప్రాజెక్టులను ప్రారంభిస్తున్నాం. తమ బ్రాండ్ పేరుకు తగ్గట్టుగా 58వ ప్రాజెక్టు అయిన అపర్ణా సరోవర్ జైకన్ లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీని నలగండ్లలో ఆరంభిస్తున్నాం. హైదరాబాద్‌లో మరో మూడు రెసిడెన్షియల్ ప్రాజెక్టులు, బెంగళూరులో రెండు ప్రాజెక్టుల్ని కొత్తగా ప్రారంభించడానికి ప్రణాళికల్ని రచిస్తున్నాం. హైదరాబాద్‌లో మరో రెండు లేఅవుట్లను ఆరంభిస్తాం. వీటితో లెక్కిస్తే.. అపర్ణా సంస్థ జాబితాలో 64 ప్రాజెక్టులు చేరాయి. నలగండ్లలో 25.6 ఎకరాల్లో అపర్ణా సరోవర్ జైకన్ ప్రాజెక్టును ఆరంభించాం. ఇందులో వచ్చే 14 టవర్లు 26 అంతస్తుల ఎత్తులో ఉంటాయి. మొత్తం 3,024 ఫ్లాట్లు వస్తాయి. ఫ్లాట్ల విస్తీర్ణం 1,240 నుంచి 2,765 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తాం. అపర్ణా చరిత్రలో అతిపెద్ద క్లబ్ హౌజును ఇందులో అభివృద్ధి చేస్తున్నాం. ఇందులో సుమారు 85 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో వీటిని నిర్మిస్తున్నాం. 2024 సెప్టెంబరు నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తాం.”
This website uses cookies.