ప్రముఖ రియల్టీ సంస్థ అపర్ణా కన్ స్ట్రక్షన్స్ అండ్ ఎస్టేట్స్ హైదరాబాద్ లో రూ.800 కోట్ల పెట్టుబడి అంచనాలతో నాలుగు రెసిడెన్షియల్ ప్రాజెక్టులు లాంచ్ చేస్తోంది. ఈ నాలుగు ప్రాజెక్టులు కలిపి 15 ఎకరాల స్థలంలో రానున్నాయి. అలాగే ఔటర్ రింగ్ రోడ్డుకు, ఐటీ హబ్ కు సమీపంలోనే ఉండనున్నాయి. అపర్ణా సైబర్ స్టార్, అపర్ణా సైబర్ షైన్, అపర్ణా సైబర్ ఆన్, అపర్ణా సైబర్ హైట్స్ పేరుతో వీటిని చేపట్టనున్నారు. 2.5 బీహెచ్ కే, 3 బీహెచ్ కేల్లో 1314 చదరపు అడుగుల నుంచి 1981 చదరపు అడుగుల మధ్యలో ఈ అపార్ట్ మెంట్లు ఉండనున్నాయి.
This website uses cookies.