Categories: EXCLUSIVE INTERVIEWS

2023లో రియ‌ల్ వృద్ధి ఖాయం

  • హాల్‌మార్క్ ఇన్‌ఫ్రాకాన్ ఎండీ గోపాలకృష్ణ

కరోనా మహమ్మారి తర్వాత రెసిడెన్షియల్ మార్కెట్ మెరుగ్గా వృద్ధి సాధించిందని.. 2023లోనూ ఇది కొనసాగుతుందని హాల్‌మార్క్ ఇన్‌ఫ్రాకాన్ ఎండీ గోపాల‌కృష్ణ తెలిపారు. ఉస్మాన్ న‌గ‌ర్‌లో హాల్ మార్క్ కౌంటీ విల్లా ప్రాజెక్టు తుది ద‌శ‌లో ఉన్న సంద‌ర్భంగా రియ‌ల్ ఎస్టేట్ గురుతో ప్ర‌త్యేకంగా మాట్లాడుతూ.. రియ‌ల్ రంగంలోకి కొత్త ఇన్వెంటరీ రావడంతో పాటు డిమాండ్ కూడా గ‌ణ‌నీయంగా పెరిగిందన్నారు. కీలకమైన ప్రాంతాల్లో వ్యవస్థీకృత బ్రాండెడ్ ప్లేయర్ల కన్సాలిడేషన్ ధోరణి మార్కెట్ వాటాను పెంచడానికి దోహదపడిందని వివరించారు.

హైబ్రిడ్ జీవన విధానం ప్రైమరీ, సెకండరీ రెసిడెన్షియల్ మార్కెట్లలో ఇళ్ల విక్రయాల పరిమాణాన్ని పెంచిందని తెలిపారు. ఇందులో మొదటిసారి ఇళ్లు కొనుగోలు చేసిన వారి దగ్గర నుంచి విలాసవంతమైన నివాసాలకు అప్ గ్రేడ్ చేసున్నవారు ఉన్నారని పేర్కొన్నారు. రెరా, కోవిడ్, జీఎస్టీ తర్వాత రియల్ రంగం రీ బూట్ అయిందని.. మెరుగైన పాదర్శకత, విశ్వాసం, జవాబుదారీతనం, ఆర్థిక క్రమశిక్షణ వంటివి పెరిగాయని తెలిపారు. ఇవన్నీ బ్రాండెడ్ పోర్టిఫోలియోల్లో పెట్టుబడులు పెట్టడానికి దేశీయ, ప్రపంచ పెట్టుబడిదారులను ఆకర్షించాయి.

వేగవంతమైన ప‌ట్టణీక‌ర‌ణ‌, మౌలిక వసతుల అభివృద్ధి, చక్కని కనెక్టివిటీ వంటివి మార్కెట్ వృద్ధి చెందడానికి దోహదపడ్డాయి. అగ్రశ్రేణి రెసిడెన్షియల్ మార్కెట్లలో సరసమైన, మధ్యస్థ, లగ్జరీ ప్రాపర్టీ విభాగాల్లో డిమాండ్ పెంచడానికి వినియోగదారుల వైవిధ్యత ప్రముఖ పాత్ర పోషించింది. ప్రీమియం తగ్గింపులు, అధిక ఎఫ్ఎస్ఐ, మెట్రో న‌గ‌రాల్లో డెవలప్ మెంట్ రెగ్యులేటరీ నిబంధనల సడలింపులు కొనుగోలుదారులకు మంచి ఫలితాలను ఇచ్చాయి.

ఇక కరోనా తర్వాత రియల్ మార్కెట్లో ఎకో ఫ్రెండ్లీ, కమ్యూనిటీ లివింగ్, బాల్కనీ అపార్టుమెంట్లు, హోమ్ ఆటోమేషన్, ఆధునిక సౌకర్యాల సమాహారం వంటివి రెసిడెన్షియల్ విభాగంలో ఆధిపత్యం చెలాయిస్తున్నాయని స్పష్టం చేశారు. అంతర్జాతీయంగా రియల్ ధరలు తగ్గుతున్న తరుణంలో భారత్ లో అందుకు భిన్నంగా 5 శాతం నుంచి 7 శాతం మేర ధరలు పెరిగాయని చెప్పారు. ఇటు దేశీయ కొనుగోలుదారులతో పాటు అటు ఎన్నారైల నుంచి కూడా స్థిరమైన డిమాండ్ ఉన్న నేపథ్యంలో 2023లో రియల్ మార్కెట్ ఆశించిన స్థాయిలో పురోగతి సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇక భారత రియల్ మార్కెట్ 2030నాటికి 15 శాతం జీడీపీతో లక్ష కోట్ల డాలర్ల మార్కెట్ గా మారుతుందన్నారు.

ఉస్మాన్ సాగ‌ర్‌లో ఇంపీరియా

గ‌చ్చిబౌలి, ఫైనాన్షియ‌ల్ డిస్ట్రిక్ట్‌, కోకాపేట్ వంటి ప్రాంతాలకు చేరువైన ఉస్మాన్ న‌గ‌ర్‌లో చేప‌ట్టిన హాల్ మార్క్ కౌంటీ విల్లా ప్రాజెక్టు చివ‌రి ద‌శ‌లో ఉంది. అక్క‌డే మ‌రో విల్లా గేటెడ్ క‌మ్యూనిటీకి శ్రీకారం చుట్టాం. దీనికి హాల్‌మార్క్ ఇంపీరియా అని పేరు పెట్టాం. 2024 చివ‌రిక‌ల్లా పూర్తి చేస్తాం. భ‌విష్య‌త్తులో ఈ ఏరియా మొత్తం పోష్ విల్లా కాల‌నీగా డెవ‌ల‌ప్ అవుతుంది. జూబ్లీహిల్స్ మ‌రియు బంజారాహిల్స్ కంటే కాస్ట్లీ ఏరియాగా అవుతుంది.

This website uses cookies.