Categories: TOP STORIES

అప‌ర్ణా కొత్త మాల్‌, మ‌ల్టీప్లెక్స్

అప‌ర్ణా క‌న్‌స్ట్ర‌క్షన్స్ న‌ల‌గండ్ల‌లో కొత్త‌గా మాల్, మ‌ల్టీప్లెక్స్‌ను ఆరంభించింది. దీనికి అప‌ర్ణా నియోమాల్ అని పేరు పెట్టింది. సుమారు 3.67 ఎక‌రాల్లో 3.5 ల‌క్ష‌ల చ‌ద‌ర‌పు అడుగుల్లో ఈ మాల్‌, మ‌ల్టీప్లెక్స్‌ను నిర్మించింది. న‌ల‌గండ్ల నుంచి సుమారు ఎనిమిది కిలోమీట‌ర్ల దూరంలో ఈ ఒక్క మాలే ఉంద‌ని అప‌ర్ణా స‌గ‌ర్వంగా చెబుతోంది. అప‌ర్ణా నియోలో సుమారు రూ.252 కోట్లు, అప‌ర్ణా సినిమాస్‌లో రూ.32 కోట్ల పెట్టుబ‌డి పెట్టామ‌ని సంస్థ వెల్ల‌డించింది.

ఈ చుట్టుప‌క్క‌ల ప్రాంతాల్లో ఉన్న సుమారు ఇర‌వై ఐదు వేలకు పైగా కుటుంబాల‌కు అప‌ర్ణా నియో మాల్ సేవ‌ల్ని అందిస్తోంది. అప‌ర్ణా సినిమాలో సుమారు ప‌న్నెండు వంద‌ల‌కు పైగా సీటింగ్ సామ‌ర్థ్యం క‌లిగి ఉంది. ఈ సంద‌ర్భంగా సంస్థ డైరెక్ట‌ర్ రాకేష్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మ‌రో నాలుగు కొత్త మాళ్ల‌ను ఆరంభించ‌డానికి ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్నామ‌ని తెలిపారు.

This website uses cookies.