Categories: AREA PROFILE

ఐకానిక్ జీవితానికి అపర్ణా సరోవర్ జైకాన్

  • నల్లగండ్లలో అదిరిపోయే హైరైజ్ కమ్యూనిటీ

విలాసవంతమైన గేటెడ్ కమ్యూనిటీలో ఐకానిక్ జీవితాన్ని కోరుకుంటున్నారా? సకల సౌకర్యాలతో చక్కని లొకేషనల్ లో ఉండాలని భావిస్తున్నారా? అయితే, ఇంకెందుకు ఆలస్యం.. వెంటనే నల్లగండ్లలోని అపర్ణా సరోవర్ జైకాన్ సందర్శించండి. మీరు కోరుకున్న జీవితానికి చక్కని చిరునామా ఇదే. కొన్నేళ్లుగా నల్లగండ్ల బాగా అభివృద్ధి చెందింది. ఎన్నో కొత్త రెసిడెన్షియల్ ప్రాజెక్టులు ఇక్కడ విస్తరించాయి. ఈ సమయంలో ఈ ప్రాంతంలో అపర్ణా సంస్థ తన హైరైజ్ ప్రాజెక్టు ఇక్కడ చేపట్టింది.

గచ్చిబౌలి ఐటీ హబ్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కు చాలా దగ్గర్లో ఉండటం అపర్ణా సరోవర్ జైకాన్ కు మరో ఆకర్షణ. 25.5 ఎకరాల సువిశాలమైన స్థలంలో విస్తరించి ఉన్న ఈ లేక్ వ్యూ అపార్ట్ మెంట్లు మీకు, మీ కుటుంబ సభ్యులకు సురక్షితమైన భద్రతతో పాటు వ్యక్తిగత గోప్యతను కూడా కల్పిస్తాయి. అదిరిపోయే సౌకర్యాలతో మీ జీవనశైలిని కొత్త ఎత్తులకు తీసుకెళ్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. జీ ప్లస్ 26 అంతస్తుల్లో 14 హైరైజ్ టవర్లు రూపుదిద్దుకుంటున్నాయి.

80 శాతం ఓపెన్ ఏరియా ఉండేలా ఈ ప్రాజెక్టును డిజైన్ చేశారు. ఒక్కసారి గేటెడ్ కమ్యూనిటీలోకి వెళితే ఒక దేనికీ బయటకు రావాల్సిన పనిలేదు అనేలా అన్ని సౌకర్యాలను సమకూరుస్తున్నారు. క్లినిక్స్, బ్యాంకులు, ఏటీఎంలు, జిమ్, స్పా, క్రెష్, గ్రాసరీ స్టోర్ అన్నీ లోపలే. రోజువారీ అవసరాలు అన్నీ కూడా గేటు లోపలే లభ్యమయ్యేలా ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంటోంది. అంతేకాదు.. మీకు మరింత గొప్పదైన జీవనశైలిని అందించడానికి అపర్ణా సరోవర్ జికాన్ అనేక సౌకర్యాలతో వస్తోంది. బిజినెస్ లాంజ్, ప్రివ్యూ థియేటర్, నీటి వేడిని నియంత్రించి ఉంచే స్విమ్మింగ్ పూల్, పెట్ పార్క్, పార్టీ లాన్, స్కేటింగ్ రింక్, అనే అనేక క్రీడా సౌకర్యాలు ఉన్నాయి.

1240 చదరపు అడుగుల నుంచి 2765 చదరపు అడుగుల మధ్యలో 2, 3, 4 బీహెచ్ కే ఫ్లాట్లు అందుబాటులో ఉన్నాయి. పిల్లల ఆటస్థలంతోపాటు మల్టీ పర్పస్ హాల్, జాగింగ్ ట్రాక్, జిమ్నాజియం, ల్యాండ్ స్కేప్ గార్డెన్, లైబ్రరీ, లిఫ్ట్, గ్యాస్ లైన్, ఇంటర్ కమ్, పవర్ బ్యాకప్, వాషింగ్ మెషీన్ ఏరియా, ఏరోబిక్స్ వంటి బోలెడు సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఎలక్ట్రిక్ కార్ల కోసం చార్జింగ్ పాయింట్లు కూడా ఉన్నాయి. కామన్ ఏరియాల్లో కరెంటు వినియోగం తగ్గించేందుకు వీలుగా 50 కిలోవాట్ల సోలార్ పవర్ వ్యవస్థ కూడా ఏర్పాటు చేశారు.

26వ అంతస్తులో అన్ని బెడ్ రూం టాయిలెట్లలోకి సోలార్ హాట్ వాటర్ వస్తుంది. వీటితోపాటు భారీ క్లబ్ హౌస్ కూడా నిర్మిస్తున్నారు. రోజువారీ కార్యకలాపాలకు అవసరమైన సౌకర్యాలన్నీ ఇందులో ఏర్పాటు చేయనున్నారు. ఇక లోకేషన్ పరంగా కూడా ఇది ఇంతో అనువైన ప్రదేశంలో ఉంది. చిరెక్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్, ఓక్రిడ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ వంటివి చాలా దగ్గర్లో ఉన్నాయి.

హైటెక్ సిటీతోపాటు గచ్చిబౌలి ఐటీ హబ్ 5 నుంచి 10 నిమిషాల డ్రైవ్ తో చేరుకోవచ్చు. పలు మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులు మూడున్నర కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. లింగంపల్లి ఎంఎంటీఎస్ స్టేషన్ కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. సకల సౌకర్యాలతో ఐకానిక్ జీవితానికి అనువైన ప్రమాణాలతో నిర్మితమవుతున్న అపర్ణా సరోవర్ జైకాన్ ప్రాజెక్టు.. 2024 సెప్టెంబర్ నాటికి అందుబాటులోకి వస్తుంది. ప్రస్తుతం చదరపు అడుగు ధర రూ.7,399గా నిర్ధారించారు. ఇందులో ఫ్లాట్లు రూ.97 లక్షల నుంచి ప్రారంభమవుతాయి. ఏప్రిల్ 4వ తేదీ నుంచి ధరలు పెరగనున్నాయి. సి, ఈ బ్లాక్స్ ఫ్లాట్ల ధరలు చదరపు అడుగుకు రూ.7,799 కానుంది. మరి వెంటనే ఈ ప్రాజెక్టు సందర్శించి మీకు అనువైన ఫ్లాట్ బుక్ చేసుకోండి.

This website uses cookies.