దాదాపు దశాబ్దం తర్వాత మహేశ్వరం రియల్ రంగం మళ్లీ కాస్త కోలుకుంటున్నట్లు అనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత జరుగుతున్న మౌలిక అభివృద్ధి కారణంగా.. ప్లాట్లు కొనేవారు మళ్లీ మహేశ్వరం వైపు దృష్టి సారిస్తున్నారు. సాగర్ రోడ్డులో ఏర్పాటైన రాంకీ డిస్కవరీ సిటీ, విశాల్ సంజీవని.. కాస్త ముందుకెళితే మ్యాక్ ప్రాజెక్ట్స్ వంటివి ఈ ప్రాంతానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఆదిభట్లలో టీసీఎస్ ఏర్పాటు కావడంతో అధిక శాతం మంది ఈ ప్రాంతం వైపు దృష్టి సారించారు. పైగా, గచ్చిబౌలి వద్ద ఎక్స్‌ప్రెస్ వే ఎక్కితే అర గంటలో మహేశ్వరంకు చేరుకోవచ్చు.
పెద్ద గోల్కొండ వద్ద ఓఆర్ఆర్ దిగి.. కుడివైపు తిరిగితే మనసాన్ పల్లికి వెళ్లే రోడ్డు వస్తుంది. అక్కడ్నుంచి కొంతదూరం వెళితే నాగారం, మనసాన్‌పల్లి చౌరస్తా వంటివి కనిపిస్తాయి. ఇక్కడి చౌరస్తాలోనే ఒక గేటెడ్ కమ్యూనిటీ వెంచర్‌లో గజం ధర సుమారు 17వేల దాకా పలుకుతోంది. చుట్టూ ప్రహారీ కట్టి.. బీటీ రోడ్లు వేసి చక్కగా అభివృద్ధి చేయడంతో.. ఇందులో స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడానికి చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. సొంతంగా ఇళ్లను కూడా కట్టుకుంటున్నారు. కాస్త ముందుకెళితే మరో వెంచర్లో గజం రూ.16 వేలు చెబుతున్నారు. ఈ రెండు వెంచర్లు మన్ సాన్ పల్లిలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. పైగా ఇల్లు కట్టుకోవడానికి అనుకూలంగా ఉన్నాయి.
This website uses cookies.