Categories: PROJECT ANALYSIS

జెమ్ ఆఫ్ ది ఈస్ట్..

  • రహేజా విస్టాస్ ఎలైట్
  • నాచారంలో రహేజా నుంచి అదిరిపోయే అపార్ట్ మెంట్స్

ప్రముఖ నిర్మాణ సంస్థ రహేజా నుంచి మరో అద్భుతమైన ప్రాజెక్టు అందుబాటులోకి వస్తోంది. నాచారంలో అదిరిపోయే సౌకర్యాలతో రహేజా విస్టాస్ ఎలైట్ రూపుదిద్దుకుంటోంది. ఆకట్టుకునే ఫీచర్లతో, ప్రతి అంశంలోనూ వైవిధ్యం కనబరిచేలా ప్రపంచస్థాయి ప్రమాణాలు, సౌకర్యాలతో జెమ్ ఆఫ్ ది ఈస్ట్ గా ఈ ప్రాజెక్టు నిలిచిపోనుంది.

బే కిటికీల నుంచి క్లబ్ హౌస్ వరకు, ప్రపంచ స్థాయి సౌకర్యాల నుంచి విశాలమైన బాల్కనీల వరకు ప్రతిదీ ఆనందపెట్టే అంశమే. ప్రాజెక్టు వద్ద సెంట్రల్ ల్యాండ్ స్కేపింగ్ తోపాటు హైదరాబాద్ నగర అందాలను వీక్షిస్తూ అద్భుతమైన జీవితం గడపడానికి రహేజా విస్టాస్ ఎలైట్ ని మించింది లేదంటే అతిశయోక్తి కాదు. అపార్ట్ మెంట్ లోని ప్రత అడుగు మిమ్మల్ని సంతృప్తిపరచడం ఖాయం. మొత్తం 300కి పైగా 3 బెడ్ సూపర్ సైజ్డ్ అపార్ట్ మెంట్లు అందుబాటులోకి రానున్నాయి.

వైవిద్యభరితమైన ప్లాన్డ్ క్లబ్ హౌస్ తోపాటు ఐజీబీసీ సర్టిఫైడ్ పొందిన ఈ గ్రీన్స్ హోమ్స్ లో బాల్కనీ సహా అన్నీ విశాలంగానే ఉంటాయి. హబ్సీగూడ మెట్రోకి దగ్గరగా ఉండటం మరో అదనపు అడ్వాంటెజ్. బాంకెట్ హాల్, ఇండోర్ గేమ్స్, ఔట్ డోర్ జిమ్నాజియం, స్విమ్మింగ్ పూల్, టెన్నిస్ కోర్టు, యోగా డెక్ వంటి ఎన్నో సౌకర్యాలున్నాయి. లోకేషన్ పరంగా కూడా ఇది చక్కటి ఏరియాలో ఉంది.

ఢిల్లీ పబ్లిక్ స్కూల్, ఈఎస్ఐ ఆస్పత్రి, ప్రసాద్ ఆస్పత్రి, ఐఐసీటీ, హబ్సీగూడ మెట్రో స్టేషన్, పారడైజ్ మాల్ మూడు నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఇక ఎన్జీఆర్ఐ, సీఎస్ షాపింగ్ మాల్ 5 కిలోమీటర్ల దూరంలో ఉండగా.. ఉస్మానియా యూనివర్సిటీ, ఆర్టీసీ ఆస్పత్రి 6 నుంచి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి.

This website uses cookies.