Categories: LATEST UPDATES

‘ప్రవీణ్ గ్రాండియో’ను బ‌య్య‌ర్ల‌కు అంద‌జేత‌

  • ఏపీఆర్ గ్రూప్ వ‌ద్ద కొన్న‌వారిలో సంతోషం

ఏపీఆర్ గ్రూప్ తన ‘ప్రవీణ్ గ్రాండియో’ ప్రాజెక్ట్ ను పూర్తి చేసింది. పటాను చెరువులో ప్రాజెక్ట్ స్థలంలోని క్లబ్ హౌస్ లో కొనుగోలుదారులకు ఫ్లాట్ల తాళం చెవులను అందించింది. పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ గోరెటి వెంకన్న, పటాన్ చెరువు కార్పొ రేటర్ మెట్టు కుమార్ యాదవ్ , ఏపీఆర్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ ఆవుల కృష్ణారెడ్డి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ జబర్దస్త్ ఆర్టిస్టులు కెవ్వు కార్తీక్, నాగి, షబీనా, రాజమౌళి (కామెడీ స్కిట్స్, మిమిక్రీ, వెంట్రిలాక్విజమ్, స్టాండ్ అప్ కామెడీ) పలు వినోద కార్యక్రమాలు నిర్వహించారు. ఏపీఆర్ ప్రస్తుత ప్రాజెక్టుల్లో ఏపీఆర్ ప్రవీణ్స్ క్రిస్టల్ అవెన్యూ (వనస్థలిపురం), ఏపీఆర్ ముక్కా ప్రవీణ్స్ సిగ్నేటర్ (బాచుపల్లి), ఏపీఆర్ ప్రవీణ్స్ హైయేరియా (పటాన్ చెరువు), ఏపీఆర్ ప్రవీణ్స్ నేచుర్ – ఫేజ్ 2 (పటాన్ చెరువు), ఏపీఆర్ ప్రవీణ్స్ హైనోరా (గాగిళ్లపూర్) ఉన్నాయి.

ఈ సందర్భంగా ఏపీఆర్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ ఆవుల కృష్ణారెడ్డి మాట్లాడుతూ, ‘‘పటానుచెరువులో 30 ఎకరాల్లో విస్తరించి ఉన్న ప్రవీణ్స్ గ్రాండియో మా కలల ప్రాజెక్టుల్లో ఒకటి. ఇది జీహెచ్ఎంసీ, రెరా ఆమోదిత లావిష్ విల్లా కమ్యూనిటీ. ఇందులో 433 దాకా మూడు, నాలుగు పడక గదుల విల్లాలు విక్రయం కోసం ఉన్నాయి. మేం వాగ్దానం చేసినట్లుగానే అనుకున్న సమయానికి యజమానులకు ఫ్లాట్లను అప్పగించడం మాకెంతో సంతోషదాయకం. వివిధ బడ్జెట్లలో కొనుగోలుదారులకు ఉత్కృష్ట ఇళ్లను అందించేందుకు, అదే విధంగా ప్రతీ కుటుంబానికి సౌకర్యాలను, విలాసాలను అందించేందుకు మాకు గల కట్టుబాటును పునరుద్ఘాటిస్తున్నాం. ఈ రోజును మేం విలువైన కస్టమర్లతో వేడుక చేసుకుంటున్నాం. ఈ ఆనందాలను మరింతగా విస్తరింపజేసేందుకు తెలంగాణ ప్రజల సొంతింటి కలను నిజం చేసేందుకు ఈ ప్రయాణాన్ని ఇలానే కొనసాగించాలని మేం విశ్వసిస్తున్నాం. మరెన్నో ఉజ్వల ప్రాజెక్టులను చేపడుతున్నాం. త్వరలోనే వాటి వివరాలను ప్రకటిస్తాం’’ అని అన్నారు.

ఏపీఆర్ గ్రూప్ డైరెక్టర్ ఆవుల సంజీవరెడ్డి మాట్లాడుతూ, ‘‘ఈ రోజును వేడుక చేసుకోవడం మాకెంతో ఆనంద దాయకం. ఒక సంస్థగా మేం ఎప్పుడూ అన్నింటికీ మించి కొనుగోలుదారులకు విలువనిస్తాం. అత్యుత్తమ సౌ కర్యాలను అందిస్తాం. పాఠశాలలు, ఆసుపత్రులు, కిరాణా, సూపర్ మార్కెట్లు లాంటివన్నీ చుట్టుపక్కల ఉండాలన్న మా ఆశయానికి అనుగుణంగానే గ్రాండియో రూపుదిద్దుకుంది. 1200కు పైగా విల్లాల తో ఉన్న గ్రాండియో కొనుగోలుదారులకు అత్యుత్తమ సదుపాయాలు అందించాలని భావించాం’’ అని అన్నారు.

ఏపీఆర్ గ్రూప్ రాబోయే ప్రాజెక్టుల్లో ఏపీఆర్ ప్రవీణ్స్ గోల్డెన్ లీఫ్ (బ్రాహ్మణ్ పల్లి, సాగర్ హైవే) ఒకటి. ఇది 45 ఎకరాల్లో విస్తరించిన ప్రాజెక్టు. డూప్లెక్స్, ట్రిప్లెక్స్ విల్లాస్ ఇక్కడ నిర్మించనున్నారు.

This website uses cookies.