Categories: LATEST UPDATES

పెంపుడు కుక్క‌ను న‌మోదు చేయ‌లేదా? రూ. 50 వేల దాకా జ‌రిమానా..

(రెజ్ న్యూస్‌, హైద‌రాబాద్‌):మీరు అమితంగా ప్రేమించే మీ కుక్క‌ను వెంట‌నే జీహెచ్ఎంసీలో న‌మోదు చేసుకోండి (https://pet.ghmc.gov.in/pl/mobile_validate). లేక‌పోతే, పొర‌పాటున మీరు బ‌య‌టికి తీసుకెళితే రూ.1000 నుంచి రూ.50,000 దాకా జ‌రిమానా విధిస్తారు. ఒక‌వేళ‌, జీహెచ్ఎంసీ అధికారులు మీ అపార్టుమెంట్‌కి వ‌చ్చి ప‌రిశీలించిన‌ప్పుడు.. మీరు న‌మోదు చేయ‌లేద‌ని గ్ర‌హిస్తే.. వెంట‌నే జ‌రిమాన‌ను విధిస్తారు. ఆ జ‌రిమానాను క‌ట్టిన త‌ర్వాత‌నే మీ కుక్క‌ను మీ చేతికి అప్ప‌గిస్తారు. జీహెచ్ఎంసీ ఇంత క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించడానికి ప‌లు కార‌ణాలున్నాయి.

నిబంధ‌న‌ల ప్ర‌కారం, ప్ర‌తి కుక్క‌కు రేబిస్ టీకా వేయించాలి. ప్ర‌తిఏటా రెన్యువ‌ల్ చేసుకోవాలి. న‌గ‌రంలో ప్ర‌స్తుతం దాదాపు 50 వేల పెంపుడు కుక్క‌లున్నాయి. అందులో కేవ‌లం 500 వ‌ర‌కూ మాత్ర‌మే న‌మోదయ్యాయి. అయితే, కొంత‌మంది జంతువు ప్రేమికులు ఏం చేస్తున్నారంటే.. కుక్క‌ను పెంచుకున్నంత కాలం పెంచుకుని, పొర‌పాటున ఏదైనా రోగం వ‌చ్చినా.. అనారోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తినా.. దాన్ని రోడ్డు మీదికి వ‌దిలి వేసి చేతులు దులిపేసుకుంటున్నారు. ఇలాంటి స‌మ‌స్య‌ను అధిగ‌మించ‌డానికే జీహెచ్ఎంసీ కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ది. పెంపుడు జంతువు అయిన కుక్క‌ల్ని త‌ప్ప‌కుండా రిజిస్ట‌ర్ చేసుకోవాల‌ని సూచించింది. రూ.50 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకోసం మీరు తాజాగా కుక్క‌కు వేయించిన వ్యాక్సీనేష‌న్ స‌ర్టిఫికెట్ అంద‌జేయాలి. నివాస ధృవీక‌ర‌ణ ప‌త్రం, మీ ఇంటి ప‌క్క‌వారి నుంచి నిర‌భ్యంత‌ర ధృవీక‌ర‌ణ ప‌త్రం స‌మ‌ర్పించాలి. జీహెచ్ఎంసీలో మీ కుక్క రిజిస్ట్రేష‌న్ అయిన త‌ర్వాత ప్ర‌త్యేక నెంబ‌రును కేటాయిస్తారు. జీహెచ్ఎంసీ వెట‌ర్న‌రీ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ లేదా డిప్యూటీ డైరెక్ట‌ర్ లైసెన్సును జారీ చేస్తారు.

PET DOG REGISTRATION MANUAL

This website uses cookies.