ఔను.. మీరు చదివింది నిజమే. ఆర్టిఫిషీయల్ ఇంటెలిజెన్స్‌తో ఇండియన్ రియాల్టీ మార్కెట్‌కు ప్రమాదం ఏర్పడే అవకాశముంది. అదెలా అంటారా?
అధిక శాతం ఐటీ కంపెనీల్లో టాప్ పొజిషన్లలో ఉన్నవారి జీతం ఏడాదికి కోటి నుంచి రూ.2 కోట్ల దాకా ఉంటుందనే విషయం తెలిసిందే కదా. ఈ స్థాయి ఉద్యోగులే ఎక్కువగా హైదరాబాద్‌లోని ఆకాశహర్మ్యాల్లో అధిక విస్తీర్ణం గల ఫ్లాట్లను కొనుగోలు చేస్తున్నారు. అయితే, ఆర్టిఫిషీయల్ ఇంటెలిజెన్స్ రాక వల్ల.. వీరి ఉద్యోగాలు ప్రమాదంలో పడిందట. అసలే అమెరికాలో గడ్డు కాలం వల్ల.. ముందుగా ఇలాంటివారు ఉద్యోగాలే ఊడిపోయే అవకాశముందని నిపుణులు అంటున్నారు. దీంతో, బడా ప్రాపర్టీలను కొన్నవారు.. ఇప్పటికే కొన్న ఇళ్లకు సంబంధించిన మిగతా సొమ్ము చెల్లించకుండా ఇబ్బంది పడతారని సమాచారం. ఫలితంగా, హైదరాబాద్ రియాల్టీ మార్కెట్‌లో కొంత గడ్డు పరిస్థితులు ఎదురయ్యే అవకాశముందని తెలిసింది.