Categories: EXCLUSIVE INTERVIEWS

స్విట్జ‌ర్లాండ్‌లో సూప‌ర్ హోమ్‌

    • ఆవికా గోర్ ఆస‌క్తిక‌ర ఆలోచ‌న‌లు
    • రియ‌ల్ ఎస్టేట్ గురు ఎక్స్‌క్లూజివ్

క‌ల‌ల గృహం కావాల‌నే క‌ల‌లు క‌న‌డాన్ని ఏమంటారు? అస‌లు దాన్ని అర్థ‌మేమిటి? అనే అంశంపై టాలీవుడ్ సంచ‌ల‌నం ఆవికా గోర్ వినూత్నంగా, ఆధునికంగా ఆలోచిస్తోంది. వ‌రుస‌గా ప‌లు ప్రాజెక్టుల‌పై సంత‌కాలు చేసిన ఈ అందాలభామ ఆలోచ‌న‌లు వినూత్నంగా ఉన్నాయి. ఈ ప్రపంచంలో ఆమెకు సంపద ఉంటే, ఆమె తన కోసం తాను నిర్మించుకునే డ్రీమ్ హౌస్‌లో అన్ని జంతువులను తీసుకువచ్చి, వాటిని ఒకే గొడుగు కిందికి తీసుకొస్తాన‌ని ప్ర‌త్యేకంగా రియ‌ల్ ఎస్టేట్ గురుకి వెల్ల‌డించింది. ఎంత మంచి ఆలోచ‌న క‌దా?

జీవితంలో మంచి విష‌యాలు.. అంత‌కంటే అద్భుత‌మైన సంఘ‌ట‌న‌లు చోటు చేసుకుంటాయ‌ని ఆమె మాట‌ల్లో క‌నిపిస్తోంది. మ‌న క‌ల‌ల క‌న్నా ఫ‌ర్వాలేదు. కాక‌పోతే త‌ర్వాత వాటిని అమ‌లు చేసేట‌ప్పుడు మెరుగ్గా ఉండాలి.”నేను ఖాళీ స్థలాల్ని ప్రేమిస్తాను. ఎక్కువ కళాఖండాలను ఉంచాల‌ని అనుకోవ‌డం లేదు. ఎందుకంటే ఆ స్థలాన్ని నృత్యం ప్రాక్టీస్ చేయ‌డానికి ఉప‌యోగిస్తాను. దీంతో పాటు నేను ఆ స్థ‌లాన్ని అద్దాల‌తో నింపాల‌నే ఆలోచ‌న ఉంది. అప్పుడే ఆ ఏరియా చాలా పెద్ద‌దిగా, చూడ‌టానికి ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపిస్తుంది. అంతేకాదు, ఆయా స్థ‌లాన్ని మంచి మంచి పేస్ట‌ల్ రంగుల‌తో తీర్చిదిద్దడం మాత్రం మ‌ర్చిపోన‌ని తెలిపారు.

avikar gor

ఆమె కలల నివాసానికి నిజమైన ముగింపుగా భావించి, ముఖ్య‌మైన ప‌నుల‌న్నీ పూర్త‌య్యాక‌.. విలాస‌వంతంగా త‌న‌కు న‌చ్చిన ఓ ప్రాంతాన్ని తీర్చిదిద్దాల‌ని భావిస్తోంది. అదేంటో తెలుసా? హోమ్ థియేట‌ర్ రూమ్‌. తన భాగస్వామితో వీలైనన్ని ఎక్కువ సినిమాలు చూడాల‌ని అనుకుంటోంది. ఆమె ప్రాణ‌మంతా సినిమాలే కాబ‌ట్టి.. హోమ్ థియేట‌ర్ రూములోకి ఆటోమెటిగ్గా ఆమె వెళ్లిపోతుంది. ఇక ఆమె దృష్టి పెట్టే మ‌రో గ‌ది ఏదైనా ఉందా అంటే.. అది వంట గ‌ది అని చెప్పాలి. ఎందుకంటే, ఆవికా గోర్‌కి వంట గ‌దిని ఆధునికంగా, ప్యూజ‌న్ స్ట‌యిల్లో తీర్చిదిద్దాల‌ని క‌ల‌ల కంటోంది. తన తల్లిదండ్రుల కోసం రుచికరమైన వంటలను వండడానికి ఎక్కువ సమయం అక్కడే గడపాలని భావిస్తోంది.

మంచుతో కప్పబడిన పర్వతాలతో చుట్టుముట్టబడిన స్విట్జర్లాండ్ యొక్క పచ్చదనం మధ్య నా క‌ల‌ల గృహాన్ని నిర్మించాల‌ని అనుకుంటున్నాను. అయితే, టర్కీ వంటి దేశంలో ఎక్క‌డో ఒక చోట నిర్మించాల‌నీ ఉంది. అయినప్పటికీ, హృదయం ఎల్లప్పుడూ ఇక్కడే ఉంటుంది కాబట్టి ‘ఆమ్చి-ముంబై’ని కూడా ఎంపికలలో ఒకటిగా ఎందుకు ఉంచ‌కూడ‌ద‌ని అనిపిస్తోంది. అందుకే, మూడు క‌ల‌ల గృహాల్ని నిర్మించాల‌ని భావిస్తున్నాను. మొత్తానికి, నటి అవికా గోర్ డ్రీమ్ హౌస్‌లో అటు మ‌నుష్యులు, ఇటు పెంపుడు జంతువుల‌కు అవ‌స‌ర‌మ‌య్యే విధంగా సృజ‌నాత్మ‌క‌మైన గృహాన్ని చూడొచ్చ‌ని ఆశించొచ్చు. ఆమె ఇల్లు ఓ డ్యాన్స్-స్టూడియోగా సృష్టించాలని మ‌నస్ఫూర్తిగా కోరుకుందాం.

This website uses cookies.