Categories: LATEST UPDATES

ఆఫీస్ స్పేస్ లో బెంగళూరు దూకుడు

2030 నాటికి దేశంలోనే నెంబర్ వన్ స్థానానికి..

సీబీఆర్ఈ నివేదిక అంచనా

ఆఫీస్ స్పేస్ స్టాక్ లో బెంగళూరు దూసుకెళుతోంది. 2030 నాటికి 330-340 మిలియన్ చదరపు అడుగుల ఆఫీస్ స్టాక్ కు చేరుకుంటుందని అంచనా. ఇది భారత్ లోనే అత్యధికం అవుతుందని సీబీఆర్ఈ పేర్కొంది. ఈ మేరకు సీఐఐతో కలిసి నిర్వహించిన అధ్యయన నివేదికను విడుదల చేసింది. ఆఫీస్ స్పేస్ వినియోగించే సంస్థల్లో టెక్నాలజీ, ఇంజనీరింగ్ తయారీ, బీఎఫ్ఎస్ఐ విభాగాలు ముందు వరసలో ఉన్నాయి. లైఫ్ సైన్సెస్, ఏవియేషన్, ఆటోమొబైల్ రంగాలు కీలకంగా ఎదుగుతున్నాయి. ఆఫీస్ స్పేస్ వినియోగంలో గత కొన్నేళ్లుగా బెంగళూరే ముందు ఉంటోంది. ఏటా సగటును 15 నుంచి 16 మిలియన్ చదరపు అడుగుల స్పేస్ కొత్తగా అందుబాటులోకి వస్తోంది. ఈ నేపథ్యంలో 2030 నాటికి ఆఫీస్ స్పేస్ వినియోగంలో దేశంలోనే నెంబర్ వన్ స్థానానికి చేరుతుందని అంచనా.

This website uses cookies.