Categories: PROJECT ANALYSIS

మియాపూర్‌లో మెరుగైన‌ గేటెడ్ క‌మ్యూనిటీ ఇదే!

అభివృద్ధికి చేరువ‌లో.. ప్ర‌శాంత‌మైన వాతావ‌ర‌ణంలో జీవించాల‌ని అనుకుంటున్నారా? అయితే, మియాపూర్ లో ఆర్వీ నిర్మాణ్‌, విజయ్ భారత్ సంయుక్తంగా నిర్మిస్తున్న సాయి వనమాలి ప్రాజెక్టును సందర్శించండి. మియాపూర్ లో ఉన్న అతిపెద్ద లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీల్లో ఇది ఒకటి. ఫేజ్-1 లో భాగంగా 2, 3 బీహెచ్ కేల్లో 585 అత్యద్భుతమైన ప్లాట్లు అమ్మకానికి రెడీగా ఉన్నాయి.

పచ్చని ప్రదేశంలో నిర్మించిన ఈ ప్రాజెక్టు ఎంతో ఆహ్లాదకరమైన అనుభూతిని అందిస్తుంది. ప్రాజెక్టు ఎంట్రన్స్ లోకి ప్రవేశించగానే.. కాంక్రీట్ జంగిల్ నుంచి పచ్చని ప్రదేశంలోకి వెళుతున్న భావన అద్భుతంగా అనిపిస్తుంది. బయటి రణగొణ ధ్వనులు, రద్దీ ప్రదేశాలు, కాలుష్యమయ వాతావరణానికి దూరంగా ఎంతో ఆహ్లాదకరమైన ప్రదేశంలోకి వెళ్లిన అనుభూతి కలగడం ఖాయం. అంత పకడ్బందీగా ఈ ప్రాజెక్టు డిజైన్ చేశారు. అవసరమైన అన్ని సౌకర్యాలతో ఎంతో సుదూర దృష్టితో రూపొందించిన ఈ 2, 3 బీహెచ్ కే ఫ్లాట్లు.. మీ జీవితాన్ని ఆనందమయం చేస్తాయి.

మియాపూర్ లోని ఇతర రెసిడెన్షియల్ ప్రాజెక్టుల మాదిరిగా కాకుండా ఆర్‌వీ సాయి వనమాలి ప్రాజెక్టు.. ఒక అడుగు కాదు, ఏకంగా మైలు దూరం ముందే ఉంటుంది. అవుట్ ఆఫ్ ది బాక్సు డిజైన్ ఈ ప్రాజెక్టు సొంతం. అత్యున్నతమైన సౌకర్యాలతోపాటు ఇంట్లో ఎంతో స్పేస్ ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇక క్లబ్ హౌస్ లో మీ కమ్యూనిటీ సౌకర్యంతో మీ క్యూబికల్ లో శాంతియుతంగా పని చేసుకునే సౌకర్యాలు కూడా ఏర్పాటు చేశారు. వైఫై కనెక్టివిటీ, భాగస్వామ్య బిజినెస్ కేంద్రాలు దీనిని ఆదర్శవంతమైన సమర్థమైన కేంద్రంగా మారుస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాగే అతిథుల కోసం గెస్ట్ రూములు కూడా ఉన్నాయి.

ఇందులో నివ‌సించేవారు తాజా గాలిని అనుభూతి చెందుతూ.. పక్షుల కిలకిలారావాలను తన్మయత్వంతో వింటూ.. అలా నడుస్తూ ఉంటే ఎలా ఉంటుంది? ఇవన్నీ సాయివనమాలి ప్రాజెక్టులో ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి సొంతమవుతాయి. గడ్డిపై చెప్పుల్లేకుండా నడస్తూ.. పరుగులు పెడుతున్న ఉడ‌తలను చూస్తూ.. పువ్వులపై పడిన మంచు బిందువులను తాకుతూ.. చెబుతుంటూనే బాగుంది కదూ? మరి వీటిని నిజంగా అనుభూతి చెందితే ఇంకెంత బాగుంటుందో ఆలోచించండి. ఇలాంటి ఎన్నో చక్కని సౌకర్యాలు కలిగి ఉంటూనే.. అటు పట్టణ వసతులకూ దగ్గరగా ఉండటం వల్ల ఇది మంచి ప్రాజెక్టు అనడంలో ఏమాత్రం సందేహాలు అక్కర్లేదు. అటు కనెక్టివిటీ, ఇటు పచ్చని ఒయాసిస్.. ఈ రెండూ కలగలిసిన అందమైన ప్రాజెక్టే సాయి వనమాలి. ఆటపాటల కోసం షటిల్ కోర్టు, క్రికెట్ నెట్, టేబుల్ టెన్నిస్, మల్టీ పర్పస్ హాల్, బాస్కెట్ బాల్ రింగ్, స్విమింగ్ పూల్, జిమ్, యోగా, ఎక్సర్ సైజ్ డెక్స్ వంటి పలు సౌకర్యాలు ఉన్నాయి.

సూప‌ర్ లొకేష‌న్‌..

ఇక లొకేషన్ చూస్తే అదరహో అనిపించక మానదు. మియాపూర్ క్రాస్ రోడ్డు కేవలం 450 మీటర్ల దూరంలో ఉంది. అంటే ఒక నిమిషంలోపే వెళ్లొచ్చన్నమాట. ఇక మెట్రో స్టేషన్ అయితే 1.6 కిలోమీటర్లు (7 నిమిషాలు), కొండాపూర్ 5.5 కిలోమీటర్లు (14 నిమిషాలు), హైటెక్ సిటీ 8.2 కిలోమీటర్ల (23 నిమిషాలు) దూరంలో ఉన్నాయి. 170 మీటర్ల దూరంలో ఉన్న యూనిసెంట్ పాఠశాలకు 2 నిమిషాల్లో వెళ్లొచ్చు.

వోక్స్ పాప్ ఇంటర్నేషనల్ స్కూల్ 1.2 కిలోమీటర్లు (4 నిమిషాలు), సిల్వర్ ఓక్స్ స్కూల్ 5.5 కిలోమీటర్లు (12 నిమిషాలు), డీఏవీ పబ్లిక్ స్కూల్ 6.2 కిలోమీటర్లు (19 నిమిషాలు), ఓక్రిడ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ 12 కిలోమీటర్లు (28 నిమిషాలు), ల్యాండ్ మార్క్ మల్టీ స్పెషాలిటీ 3.3 కిలోమీటర్లు (9 నిమిషాలు), ఉషా ముళ్లపూడి ఆస్పత్రి 5.5 కిలోమీటర్లు (11 నిమిషాలు), మమత ఆస్పత్రి 4.7 కిలోమీటర్లు (13 నిమిషాలు), బీవీఆర్ఐటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ 4.7 కిలోమీటర్లు (11 నిమిషాలు), గోకరాజు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ 6.5 కిలోమీటర్లు (13 నిమిషాలు), జేఎన్టీయూ 5.4 కిలోమీటర్లు (14 నిమిషాలు), వీఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ 8.3 కిలోమీటర్ల (19 నిమిషాల) దూరంలో ఉన్నాయి. మరి ఇన్ని ప్రత్యేకతలున్న సాయి వనమాలి ప్రాజెక్టును సందర్శించి మీ ప్లాట్ రిజర్వు చేసుకోండి.

This website uses cookies.