Categories: LATEST UPDATES

సూపర్ టెక్ చైర్మన్ పై ఈడీ చార్జిషీట్

మనీ ల్యాండరింగ్ కేసులో సూపర్ టెక్ గ్రూప్ చైర్మన్ ఆర్.కె.అరోరాపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చార్జిషీట్ దాఖలు చేసింది. అరోరాతోపాటు సూపర్ టెక్ కంపెనీ, మరో ఎనిమిది మందిని నిందితులుగా పేర్కొంది. వీరంతా 670 మందిని రూ.164 కోట్ల మేర మోసం చేశారని అభియోగాలు మోపింది. దాదాపు వంద పేజీలున్న చార్జిషీటును ప్రత్యేక న్యాయమూర్తి దేవేందర్ కుమార్ జంగల ముందు దాఖలు చేశారు.

మనీ ల్యాండరింగ్ అంశంలో అరోరాను విచారించేందుకు తగిన ఆధారాలున్నాయని అందులో పేర్కొన్నారు. చార్జిషీటును పరిశీలించిన న్యాయమూర్తి తదుపరి విచారణను ఈనెల 28కి వాయిదా వేశారు. మనీ ల్యాండరింగ్ కేసులో ఈ ఏడాది జూన్ 27న అరోరాను ఈడీ అరెస్టు చేసింది. ఈ అంశంలోఅరోరాతోపాటు సూపర్ టెక్ కంపెనీ, ఆ సంస్థ డైరెక్టర్లు, ప్రమోటర్లపై ఢిల్లీ, హర్యానా, యూపీల్లో కేసులు నమోదయ్యాయి.

This website uses cookies.