భారతీ బిల్డర్స్.. 2020లో నవంబరులో మనోహర్‌రెడ్డి అనే వ్యక్తి వద్ద.. కొంపల్లిలో 6.5 ఎకరాల్ని అగ్రిమెంట్ చేసుకుని 2021 ఆగస్టులో కొనుగోలు చేసింది. కాకపోతే ఆ స్థలాన్ని ఇప్పించిన సంస్థని పక్కన పెట్టేసింది. ఆయా కంపెనీకి ఇవ్వాల్సిన సొమ్మును సైతం ఇవ్వకుండా ఎగ్గొట్టేసింది. ఆతర్వాత, ఆయా సంస్థకు తమకు సంబంధం లేదంటూ ఏకంగా పత్రికల్లో టెర్మినేషన్ ప్రకటనను కూడా విడుదల చేసింది. దీంతో, చిర్రెత్తుకొచ్చిన ఆయా కంపెనీ భారతీ బిల్డర్స్ తో పాటు సునీల్ కుమార్ అహుజా మీద 2021 ఆగస్టు 15న పేట్ బషీర్‌బాద్ పీఎస్‌లో ఐపీసీ సెక్షన్ 406, 420, 506 కింద కేసు పెట్టింది. సూట్ కూడా ఫైల్ చేసింది. భారతీ బిల్డర్స్ తరఫున కల్వకుంట్ల కవిత పీఏలు ప్రణీత్, బిక్షపతిలు, 2021లో అర్థరాత్రి రెండు గంటల దాకా కూర్చోపెట్టి.. ఇరు సంస్థల మధ్య సెట్మిల్మెంట్ చేసినట్లు సమాచారం. ఫలితంగా, భారతీ బిల్డర్స్ సుమారు రూ.25 కోట్లు దాకా ఆయా కంపెనీకి చెల్లించాలని తెలిసింది.
* కొంపల్లి స్థలాన్ని రిజిస్టర్ చేసుకున్నాక.. భారతీ బిల్డర్స్ ఎండీ శివరామకృష్ణ ఏం చేశాడంటే.. సునీల్ కుమార్ అహూజా అనే వ్యక్తి వద్ద ఆయా స్థలాన్ని తాకట్టు పెట్టి.. సుమారు రూ.80 కోట్ల దాకా రుణం తీసుకున్నాడని తెలిసింది. దీనిపై సుమారు నాలుగైదు రూపాయలు వడ్డీ చెల్లిస్తున్నాడని సమాచారం. అయితే, ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. భారతీ బిల్డర్స్‌కు ఎవరైతే స్థలం ఇప్పించారో.. వారే ఆయా భూమిపై సూట్ ఫైల్ చేశారు. ఇప్పుడు కోర్టుకు రూ.25 లక్షల దాకా ఫీజు కట్టి.. సబ్ రిజిస్ట్రార్‌కు అప్పగిస్తే.. సునీల్ అహుజా పేరిట రిజిస్టర్ అయిన డాక్యుమెంట్ రద్దవుతుందని సమాచారం.
ఎలా బయటికొచ్చింది?
హైదరాబాద్ నిర్మాణ రంగంలో దాదాపు రెండు దశాబ్దాలకు పైగా అనుభవం గల ఓ బిల్డర్.. ఇటీవల భారతీ బిల్డర్స్‌కు చెందిన కొంపల్లి, భానూరు కస్టమర్లతో సమావేశమయ్యారు. అందరూ అంగీకరిస్తే.. రెండు ప్రాజెక్టుల్ని తాను టేకప్ చేస్తానని చెప్పుకొచ్చారు. ఎవరైనా ప్రాజెక్టులో నుంచి బయటికి వెళ్లాలని అనుకుంటే వెళ్లిపోవచ్చని అన్నారు. వెంటనే ఎవరైనా ప్రాజెక్టులో నుంచి నిష్క్రమిస్తే.. వారు చెల్లించిన సొమ్ముతో ఇరవై ఐదు శాతం మినహాయించుకుని మిగతా సొమ్మును ఇస్తానని మొదటి ప్రతిపాదన చేశాడట. దీంతో, కొందరు సదరు బిల్డర్‌ను వ్యతిరేకించారట. సొమ్ము కట్టి మూడేళ్ల నుంచి ఎదురు చూస్తుంటే.. ఇరవై ఐదు శాతం సొమ్మును ఎలా కోత కోస్తావని నిలదీశారట. రెండు ప్రతిపాదన ఏమిటంటే.. ఆరు నెలల దాకా వేచి చూసేవారికి వంద శాతం సొమ్ము వెనక్కి ఇస్తామని, ఏడాది అయితే బ్యాంకు వడ్డీ చొప్పున లెక్కగట్టి సొమ్ము వెనక్కి ఇస్తామని ఆఫర్ ఇచ్చారట. దీంతో, కొనుగోలుదారుల్లో కొంతమంది తిరగబడి.. భారతీ బిల్డర్స్ మీద కేసు పెట్టారని తెలిసింది. ఆ బిల్డర్ గనక కాస్త తెలివిగా వ్యవహరించి.. కొనుగోలుదారులకు నచ్చచెప్పి ఉంటే.. కేసు పెట్టేంత వరకూ వచ్చేది కాదని సమాచారం. ఏదీఏమైనా బయ్యర్లతో ఒక ఆటాడుకున్న భారతీ బిల్డర్స్ వసూలు చేసిన సొమ్మును వెనక్కి ఇప్పించాలని కొనుగోలుదారులు కోరుతున్నారు.
This website uses cookies.