Categories: LATEST UPDATES

తెలంగాణలో ఫాక్స్ కాన్ ప్లాంటుకు భూమి పూజ

రూ.4వేల కోట్ల పెట్టుబడి.. 25 వేల మందికి ఉపాధి

రాష్ట్రంలో మరో కొత్త పరిశ్రమకు అంకురార్పణ జరిగింది. తైవాన్ కు చెందిన ఎలక్ట్రానిక్స్ దిగ్గజం ఫాక్స్ కాన్ సంస్థ దాదాపు రూ.4వేల కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేస్తున్న ఫ్యాక్టరీకి భూమి పూజ జరిగింది. రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్ గ్రామంలో ఫాక్స్ కాన్ ప్లాంటుకు మంత్రి సబితతో కలిసి మంత్రి కేటీఆర్ భూమి పూజ చేశారు. ఈ కంపెనీ రాకతో దాదాపు 25వేల మందికి ఉపాధి లభించనుంది. చైనాకు మించి తయారీ కార్యకలాపాలను విస్తరించే ప్రణాళికలో భాగంగా ఈ ప్లాంటు ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ఫాక్స్ కాన్ అనేది ఏపిల్ కంపెనీకి అతిపెద్ద సరఫరాదారులలో ఒకటి. ఐఫోన్లలో గణనీయమైన భాగాలను ఫాక్స్ కాన్ ఉత్పత్తి చేస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో ఏర్పాటు చేస్తున్న ప్లాంటులో ఏపిల్ వైర్ లెస్ ఇయర్ బడ్స్ అయిన ఎయిర్ పాడ్స్ తయారవుతాయి. భూమి పూజ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ఫాక్స్ కాన్ కొత్త ప్లాంటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు మంచి ఊపు తెస్తుందని వ్యాఖ్యానించారు. తొలి దశలోనే రూ.4వేల కోట్ల పెట్టుబడితో 200 ఎకరాల్లో ఈ ప్లాంటు రూపుదిద్దుకుంటుందని తెలిపారు. దీనివల్ల మొత్తం లక్ష మంది వరకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుందని వెల్లడించారు.

This website uses cookies.