బాలీవుడ్ నటి ఇహానా థిల్లాన్
బాలీవుడ్ నటి ఇహానా థిల్లాన్ కు డ్రీమ్ హోమ్ అనే భావన చాలా కీలకమైనది. ఇది ఆమె వ్యక్తిగత అభిరుచులతో ప్రతిబింబిస్తుంది. పంజాబ్ లో పుట్టి పెరిగిన ఇహానా.. పంట పొలాల మధ్య తన తల్లిదండ్రులతో కలిసి ఓ సాధారణ ఇంట్లో గడిపిన బాల్యాన్ని ఎంతో అపురూపంగా చూసుకుంటారు. ‘నా కోసం ఓ డ్రీమ్ హోమ్ కొనుక్కోవడం అనేది నేను చేయాల్సిన పనుల జాబితాలో అలాగే ఉంది’ అంటూ ఆమె చెప్పడం.. ఓ రైతు కుటుంబంలో పుట్టిన మూలాలను గుర్తుచేస్తుంది. సాంస్కృతిక సూక్ష్మ నైపుణ్యాలతో కూడిన మినమలిస్టిక్ సౌందర్యం తన కలల సౌథంలో కనిపించాలనేది ఇహానా ఆకాంక్ష. ‘మోడ్రన్ డెకర్, నా సంస్కృతి, నాకు నచ్చే రంగులతో వీలైనంత మినిమలిస్ట్ క్ గా నా ఇల్లుండాలి’ అని ఆమె పేర్కొన్నారు. గ్రే, వైట్స్, పాస్టెల్స్ తో కూడిన లేత రంగులే ఆమె ప్రాధాన్యత. అంతేకాకుండా సానుకూల శక్తిని ప్రతిబింబించే విశాలమైన, ప్రశాంతమైన వాతావరణాన్ని కోరుకుంటున్నారు.
ఫామ్ హౌస్ లో పెరిగిన ఇహానా.. తన ఆదర్శవంతమైన ఇల్లు కూడా అలాగే ఉండాలని ఆకాంక్షిస్తున్నారు. చుట్టూ పచ్చదనంతో కూడిన ఫామ్ హౌస్ వంటి ఇల్లు లేదా గార్డెనింగ్ కోసం తగినంత స్థలం ఉన్న వ్యక్తిగత విల్లాలా ఉండాలనేది ఆమె ఆలోచన. ‘నాకు గుర్రాలు, గుర్రపు స్వారీ అంటే చాలా ఇష్టం. అందువల్ల నాకు కూడా సొంతంగా ఓ గుర్రపుశాల వంటిది ఉండాలి’ అని ఇహానా వెల్లడించారు. అంతేకాకుండా తనకు ఇష్టమైన వీధికుక్కలు, పిల్లులకు ఆశ్రయం కల్పించడానికి వీలుగా బీచ్ లో విశాలమైన తోటతో కూడిన అందమైన బంగ్లా కావాలని ఆమె కలలు కంటున్నారు. జంతువుల పట్ల ఆమెకు ఉన్న జాలి, దయ.. తన కలల సౌథంలో ఓ అభయారణ్యం వంటిది ఏర్పాటు చేయాలనే ఆకాంక్షను బలపరుస్తున్నాయి.
ఇహానాకు పఠనాసక్తి కూడా చాలా మెండుగా ఉంది. చదవడం, ఒంటరిగా ఉండటం అంటే తనకు ఎంత ఇష్టమో ఆమె వెల్లడించారు. ‘నాకు రీడింగ్ రూమ్ చాలా అవసరం. అక్కడే నాకు కాస్త ప్రశాంతత, ప్రేరణ లభిస్తాయి’ అని వివరించారు. ఏ లొకేషన్లో ఇల్లు ఉండాలని అనే అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడు ఆమె మూడు ప్రాంతాల్లో ఏది ఎంచుకోవాలి అనేదానిపై సంఘర్షణకు గురవుతున్నారు. మనదేశంలోని పాండిచ్చేరి, అండమాన్ దీవులతోపాటు ఇటలీలో ఏది ఎంచుకోవాలి తెలియక సతమతమవుతున్నారు. వైబ్ అనేది తనకు చాలా ముఖ్యమైని చెబుతూ ఇంటి వాతావరణం ఎలా ఉండాలో వివరించారు. అలాగే ఇంటీరియర్ డిజైనర్ల నైపుణ్యాన్న ఆమె మెచ్చుకుంటారు. తన ఇంటిని అలంకరించే విధానాన్ని ఆమె చాలా ఇష్టపడతారు. తన సౌకర్యం, అభిరుచికి అనుగుణంగా ప్రతిదీ ఎంచుకోవడానికి ఇష్టపడతానని వెల్లడించారు.
వ్యక్తిగత ప్రాధాన్యత వైవిధ్యం గురించి ప్రస్తావిస్తూ.. ప్రతి వ్యక్తి యొక్క సౌలభ్యం, శైలి మారుతూ ఉంటుందని ఇహానా అంగీకరించారు. ‘మీరు ఎక్కువ సమయాన్ని గడిపే స్థానంలో ఇల్లు మొదట ఉంటుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ తమ సొంత సౌకర్యాలను కనుక్కునే పనిలో ఉంటారు’ అని వివరించారు. ఇక డ్రీమ్ హోమ్ ను నెరవేర్చుకునే అంశంలో బడ్జెట్ పరిమితులు ఓ క్లిష్టమైన సవాల్ అని పేర్కొన్నారు. ‘మీ ఇంటిని అలంకరించేటప్పుడు బడ్జెట్ ఎప్పుడూ ఆందోళన కలిగిస్తుంది’ అని స్పష్టంచేశారు. ఆర్థిక పరిమితులతో ఆకాంక్షలను సమతుల్యం చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. రియల్ ఎస్టేట్ ట్రెండ్ ఎలా ఉందో విశ్లేషించే విషయంలో తనకు అంత అనుభవం లేదని ఒప్పుకున్నారు. అయితే, ఒకరు తన కలల ఇంటిని నిజం చేసుకోవడానికి వ్యక్తిగత అభిరుచి, బడ్జెట్ చాలా ప్రధానమన్నారు. ప్రకృతి, జంతువులు, ఒంటరితనం పట్ల ఆమెకున్న మక్కువతో ఇహానా థిల్లాన్ కలల సౌథం.. వ్యక్తిగత విలువలు, సౌందర్య ప్రాధాన్యతల సామరస్య సమ్మేళనాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ అభయారణం స్పూర్తిని, సౌకర్యాన్నిఅందించడానికి సిద్ధంగా ఉంది.