Categories: Celebrity Homes

18 ఏళ్లకే సొంతిల్లు కొన్నా

ఈఎంఐలు కట్టడానికి చాలా చేయాల్సి వచ్చింది

నటి డైసీ షా వెల్లడి

నటి డైసీ షా 18 ఏళ్ల వయసులో సొంతంగా స్వతంత్రంగా మారినప్పుడు చాలా అద్భుతంగా ఫీలయ్యారు. ఆమె సొంతంగా ఎంపిక చేసుకోగలడంతోపాటు ఇంటిపై పెట్టుబడి పెట్టడం, ఇతరులపై ఆధారపడకుండా ఎలా ఉండాలో కూడా తెలుసుకున్నారు. ఆమె షోబిజ్ రంగంలో ఉన్నప్పటికీ, ఇంకా స్వతంత్రంగా జీవించాలని బలంగా కోరుకుంటారు. ‘అవును.. నేను 18 ఏళ్ల వయసులో నా సొంత ఇల్లు కొన్నాను అన్నది నిజం. ఎందుకంటే నేను ఎవరి దయాదాక్షిణ్యాలపై ఆధారపడాలని అనుకోను. ఈఎంఐలు చెల్లించడానికి ఎలా కష్టపడ్డా, ఏం చేయాల్సి వచ్చిందనే విషయాన్ని కూడా నా అభిమానుల దగ్గర దాచను. నా సొంత ఇంటిని కూడా సరిగా ఆస్వాదించలేకపోయినందుకు అప్పుడప్పుడు కాస్త బాధ అనిపిస్తుంది. నా తీరికలేని కొరియోగ్రఫీ షెడ్యూళ్ల కారణంగా వెళ్లి పడుకోవడానికి మాత్రమే ఇంటిని ఉపయోగించుకున్నాను. ఇదేదో ఫిర్యాదు కాదు.. కేవలం నా భావన మాత్రమే. నిజానికి నాతో సహా అందరూ ఇంత చిన్న వయసులో సొంత ఇల్లు కొనడం ఒక పెద్ద విషయంగా చూస్తున్నారు. నాకు చాలామంది సహోద్యోగులు ఉన్నారు. వారు అద్దె ఇళ్లలో నివసిస్తున్నారు. కానీ నాకు సొంత ఇల్లు ఉంది’ అని డైసీ వివరించారు.

సొంత ఇల్లు కొనుగోలుకు మొగ్గు చూపినంత మాత్రాన డైసీ ఆస్తుల్లో మునిగిపోయేలా వ్యవహరించరు. మినిమలిజంగా ఉండటమే మీ ఇంటి కోసం మీరు చేయగల ఉత్తమమైన పని అని ఆమె నమ్ముతారు. ‘నాకు దేనినీ అంత విలాసవంతంగా అలంకరించడం ఇష్టం లేదు. సంయమనంతో కూడిన ప్యాలెట్, సరళత మీ ఇంట్లో అద్భుతాలు చేయగలవు. భౌతిక వస్తువుల కంటే చాలా తోట స్థలం ఉన్న బంగ్లాయే నా ప్రాధాన్యతల్లోముందుంటుంది. ఎవరైనా దీనిని మినమిలిస్టిక్ గా డిజైన్ చేస్తే.. అందులో లోటుపాట్లు కూడా చాలా తక్కువగా ఉంటాయి. పైగా నేను పెట్ లవర్ ని. ముఖ్యంగా శునకాలంటే నాకు చాలా ఇష్టం. నా గార్డెన్ మొత్తం వాటితోనే ఎందుకు నింపకూడదు అని అనుకుంటాను. మొత్తమ్మీద నాకు అందమైన, ఆచరణాత్మక స్థలం కావాలి’ అని పేర్కొన్నారు.

తన కోసం ఔట్ డోర్ లో ఓ స్పేస్ ను ఏర్పాటు చేసుకోవడం స్ఫూర్తిదాయకం అనిపిస్తుంది. ‘ఇది చిన్న పచ్చిక అయినా.. గడ్డి రకం నుంచి పూల మొక్కల వరకు ప్రతిదీ చాలా మనోహరంగా ఉంటుంది. బయట జంతువులు పడుతున్న బాధలు చూసి. వాటన్నింటికీ ఈ విశాలమైన పచ్చికలో పునరావాసం కల్పించాలనుకుంటున్నాను. నా చుట్టూ చాలా సహజమైన పరిసరాలు ఉండాలన్నదే నా అభిమతం’ అని డైసీ షా వెల్లడించారు. ఇక ఆమె లివింగ్ రూమ్ లో చాలా భిన్నమైన విషయం ఉంది. ఇతర సిలబస్ ఇళ్లు లేదా సాధారణ నివాసాల వంటిది కాదు. ఎందుకంటే ఓ నిర్దిష్ట కారణంతో ఆమె లివింగ్ రూమ్ లో టీవీ లేదు. అక్కడ కుటుంబం మొత్తం కలిసి ఆడుకుంటుంది.. కలిసి తింటుంది.

తీవ్రంగా చర్చించుకుంటుంది కూడా. ‘నేను సముద్ర జీవ ప్రేమికురాలిని కాబట్టి.. అవకాశం వస్తే సముద్రం దగ్గర ఇల్లు కట్టుకోవడానికి ఇష్టపడతాను. మాల్దీవులు, మారిషస్ నాకు అత్యంత ఇష్టమైన ప్రదేశాల్లో ఒకటిగా ఉన్నాయి. నేను ప్రతిరోజూ దాని గురించి ఆలోచించడం కాదు.. చాలా ఇష్టపడతాను. నేను చాలా ప్రాక్టికల్ మహిళను. నాకు ఇది కొన్నిసార్లు అవాస్తవంగా కూడా అనిపిస్తుంది. కానీ ఎవరికి తెలుసు? ఏదో ఒకరోజు ఏంజెల్ ఇన్వెస్టర్ ని కనుక్కుంటానేమో? అంటే వెకేషన్ హోమ్ కి నేను సిద్ధంగా ఉన్నాననేది నా ఉద్దేశం’ అని వివరించారు. ఇంటికి సంబంధించిన ఇంటీరియర్ ను డిజైనర్ చేత చేయించరు. ఆమె తన ప్రాధాన్యతలు, జీవనశైలికి అనుగుణంగా దానిని తీర్చిదిద్దుకుంటారు. ఆ విషయంలో ఆమె ఎప్పటికీ రాజీపడరు. ఖాన్ కుటుంబం ఇళ్లను తరచుగా సందర్శించే డైసీకి అక్కడ కొన్ని వస్తువులంటే ఇష్టం. అర్పితాఖాన్ ఇంట్లో సోఫా సెట్ అలంకరించి ఉన్న బాల్కనీ, అర్పిత లివింగ్ రూమ్ లో కుర్చీలు కొన్ని ఉదాహరణలు.

This website uses cookies.