Categories: LATEST UPDATES

ప్రతి సైటులో బిల్డింగ్ ప్లాన్ పెట్టాల్సిందే – GHMC

హైదరాబాద్లో అక్రమ నిర్మాణాలపై కఠినంగా వ్యవహరించాలని జీహెచ్ఎంసీ (GHMC) నిర్ణయించింది. వ్యక్తిగత ఇల్లు కట్టేవారైనా.. బిల్డర్లయినా.. తప్పనిసరిగా బిల్డర్ పర్మిట్ నిబంధనల్ని సైటు వద్ద అందరికీ కనిపించేలా ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఫ్లాటు కొనడానికి ఎవరొచ్చినా.. స్థానిక సంస్థ ఎన్ని అంతస్తులకు అనుమతినిచ్చిందనే విషయాన్ని సులువుగా తెలుస్తుంది.

అనుమతికి విరుద్ధంగా నిర్మాణాల్ని కడుతున్నా.. కొనుగోలుదారులకూ అర్థమవుతుంది. వాస్తవానికి, జీహెచ్ఎంసీ జారీ చేసిన బిల్డింగ్ పర్మిట్ ఆర్డర్‌లో కూడా ఈ షరతు గురించి పేర్కొన్నారు. కానీ, చాలామంది బిల్డర్లు.. సైటు వద్ద బిల్డింగ్ ప్లాన్ ప్రదర్శించడం లేదు. ఇక నుంచి “మంజూరు చేసిన బిల్డింగ్ ప్లాన్ ను సైటు వద్ద ప్రదర్శించకుండా నిబంధనలను ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకుంటామ”ని జీహెచ్ఎంసీ పేర్కొంది.

This website uses cookies.