RERA Real Estate Regulatory Authority
రెరా చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత కొనసాగుతున్న ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టిన హోమ్ బయ్యర్ల అంచనాల్ని అందుకోవడంలో రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ చట్టం విఫలమైందని హోమ్‌బ్యూయర్స్ సంస్థ అభిప్రాయపడింది. మన దేశంలో ఐదేళ్ల క్రితం అమల్లోకి వచ్చిన రెరా చట్టం ప్రకారం.. కొత్త నిర్మాణాలతో పాటు ప్రస్తుతం నిర్మాణం జరుపుకుంటున్న ప్రాజెక్టుల్ని నమోదు చేశారు. అయితే ఇందులో నమోదైన మొత్తం ప్రాజెక్టుల్లో కనీసం పద శాతం కూడా పూర్తి కాలేదని ఫోరం ఫర్ పీపుల్స్ కలెక్టీవ్ ఎఫర్ట్స్ అధ్యక్షుడు తెలిపారు. ఆయా ప్రాజెక్టుల్లో ఇరుక్కుపోయిన కొనుగోలుదారుల సొమ్మును వెనక్కి తెప్పించడమే రెరా ముఖ్య ఉద్దేశ్యమన్నారు.
రెరా అమల్లోకి వచ్చిన తరువాత ఎన్ని ప్రాజెక్టులు నిర్ణీత గడువులోపే పూర్తయ్యాయనే అంశంపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి. వాటిని పూర్తి చేయడంలో ఎంత ఆలస్యం జరిగింది? ప్రాజెక్టు పూర్తి కావడానికి పొడిగింపును పొందడం బిల్డర్ల జన్మహక్కు కాదన్నారు.
కేంద్రం రెరా చట్టానికి విరుద్ధంగా రియల్ ఎస్టేట్ చట్టాన్ని పొందుపర్చిన పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంపై ఎఫ్పీసీఈ కేసు గెలిచింది. ఆ రాష్ట్ర చట్టం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు పేర్కొంది. బిల్డర్లకు ఉపశమనం లేదా సౌకర్యాన్ని అందించే విషయానికి వస్తే ప్రభుత్వ అధికారులు బాక్స్ ఆలోచనల నుండి బయటపడతారని ఆయన ఆరోపించారు. కోవిడ్ కారణంగా కొనసాగుతున్న ప్రాజెక్టులకు కాలపరిమితులు పొడిగించాలని గత ఏడాది గృహనిర్మాణ మంత్రిత్వ శాఖ తీసుకున్న చర్యను తాము వ్యతిరేకించామని సంస్థ తెలిపింది.
This website uses cookies.