Categories: LATEST UPDATES

బిల్డర్ రిజిస్ట్రేషన్ మాడ్యుల్

స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ బిల్డర్లకు ఉపయోగపడే ఒక చక్కటి సేవను అందుబాటులోకి తెచ్చింది. రియల్టర్ కానీ డెవలపర్ కానీ ప్లాటు లేదా ఫ్లాట్లను విక్రయించిన ప్రతిసారీ వారి వివరాల్ని నమోదు చేయనక్కర్లేదు. తాజాగా బిల్డర్ రిజిస్ట్రేషన్ మాడ్యుల్ ని అందుబాటులోకి తెచ్చింది. ఒక రియల్టర్ ప్లాటు అమ్మిన ప్రతిసారి తన వివరాల్ని నమోదు చేయనక్కర్లేదు. కొన్ని సందర్భాల్లో ఎక్కువ ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయాల్సి వస్తే.. ఆయా వివరాల్ని పొందుపర్చడానికే అధిక సమయం పడుతోంది. ఫలితంగా, రిజిస్ట్రేషన్ వాయిదా వేయాల్సిన సందర్భాలున్నాయి.

ఈ సమస్యను అధిగమించేందుకు.. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కొత్త మాడ్యుల్ని తీసుకొచ్చింది. ఇందులో రియల్టర్ కు ప్రత్యేకంగా ఒక డాష్ బోర్డు ఉంటుంది. అందులో అతని వెంచర్లకు సంబంధించిన పూర్తి వివరాలు నమోదై ఉంటుంది. ప్రస్తుతం ఎన్ని ప్లాట్లను విక్రయించాడు.. ఇంకా అమ్మాల్సిన వాటి వివరాలు తెలుస్తాయి. దీంతో, డబుల్ రిజిస్ట్రేషన్ కీ ఆస్కారం ఉండదు. దీని వల్ల రాష్ట్రవ్యాప్తంగా బిల్డర్లకు డాక్యుమెంటేషన్ సమయం గణనీయంగా తగ్గుతుంది.

This website uses cookies.