Categories: LEGAL

సుప్రీం ఉత్తర్వ్యులతో దివాళా అంచున బిల్డర్లు

  • లక్షన్నర ఇళ్ల రిజిస్ట్రేషన్లపైనా ప్రభావం
  • క్రెడాయ్ ఆందోళన

పలువురు బిల్డర్లకు లీజు ప్రాతిపదికన ఇచ్చిన భూములకు సంబంధించిన బకాయిలను 8 శాతం వడ్డీతో చెల్లించాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై క్రెడాయ్-ఎన్సీఆర్ ఆందోళన వ్యక్తం చేసింది. దీని ప్రభావం బిల్డర్లపై దారుణంగా ఉంటుందని, వారు దివాళా తీసే ప్రమాదం కూడా పొంచి ఉందని పేర్కొంది. అంతే కాకుండా దాదాపు లక్షన్నర రిజిస్ట్రేషన్లపై కూడా ప్రభావం పడుతుందని తెలిపింది. ఈ నేపథ్యంలో బిల్డర్ల బకాయిల విషయంలో సానుభూతితో వ్యవహరించి వారి ప్రయోజనాలను రక్షించాలని కోరింది.

నోయిడా, గ్రేటర్ నోయిడాకు చెందిన దాదాపు 100 మందికి పైగా బిల్డర్లు సమావేశమై దీనిపై చర్చించారని.. తమను ఈ పరిస్థితి నుంచి బయటపడేసేందుకు వన్ టైమ్ సెటిల్ మెంట్ ప్రకటించారని కోరుతున్నారని వెల్లడించింది. సుప్రీం తీర్పు అనంతరం అధికార యంత్రాగంగా ఇప్పటికే బిల్డర్లకు నోటీసులు ఇస్తోందని, వీటిపై వారు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారని పేర్కొంది. ‘తుది మొత్తంపై 15 నుంచి 23 శాతం వడ్డీ పడుతోందని బిల్డర్లు ఆందోళన చెందుతున్నారు.

ఇది ప్రస్తుత మార్కెట్ రేటు కంటే చాలా ఎక్కువ. ఈ నేపథ్యంలో నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ ను ఆశ్రయించాల్సి ఉంటుందని అనుకుంటున్నారు’ అని క్రెడాయ్-ఎన్సీఆర్ అధ్యక్షుడు మనోజ్ గౌర్ పేర్కొన్నారు. బకాయిల చెల్లింపులతో ఆక్యుపెన్సీ, కంప్లీషన్ సర్టిఫికెట్ల జారీ ముడిపడి ఉండటంతో కొనుగోలుదారులు తమ ఇళ్లను రిజిస్ట్రేషన్ చేయించుకోలేరని, దీనివల్ల దాదాపు లక్షన్నరకు పైగా ఇళ్ల రిజిస్ట్రేషన్ నిలిచిపోతుందని అభిప్రాయపడ్డారు. అందువల్ల హర్యానాలో చేసినట్టుగా ఇక్కడ కూడా వన్ టైం సెటిల్ మెంట్ (ఓటీఎస్) ప్రకటించాలని కోరారు. ఈ విషయాన్ని సానుభూతితో అర్థం చేసుకుని తగిన నిర్ణయం తీసుకోవాలని విన్నవించారు.

This website uses cookies.