Categories: LATEST UPDATES

2023 లోపు.. విమానాశ్ర‌యానికి కొత్త సొబ‌గులు

శంషాబాద్ విమానాశ్ర‌యానికి స‌రికొత్తగా రూపుదిద్దుకుంటోంది. 2023 లోపు పూర్తయ్యే ఆధునీక‌ర‌ణ ప‌నుల కార‌ణంగా మ‌రిన్ని జాతీయ‌, అంత‌ర్జాతీయ విమానాలు న‌గ‌రానికి విచ్చేస్తాయి. అంతా స‌వ్యంగా సాగితే, 2023లోపు ఈ ప‌నుల‌న్నీ పూర్త‌వుతాయి. పైగా, ఏటా 3.4 కోట్ల మంది ప్ర‌యాణీకులు రాక‌పోక‌ల్ని సాగించొచ్చు. కొత్త‌గా 149 చెకిన్ కౌంట‌ర్లు, 26 సెక్యూరిటీ స్క్రీనింగ్ మెషీన్లు, ఏటీఆర్‌లు, 44 ఇమిగ్రేష‌న్ కౌంట‌ర్ల‌ను ఏర్పాటు చేస్తారు.

కొత్త భ‌వ‌నాల్లో స‌రికొత్త లాంజీలు, రిటైల్‌, ఎఫ్‌బీ ఔట్‌లెట్లు ఏర్పాట‌వుతాయి. మెరుగుప‌రుస్తున్న మౌలిక సదుపాయాల కార‌ణంగా 44 కొత్త కాంటాక్టు గేట్లు, 28 రిమోట్ డిపార్చ‌ర్ గేట్లు, 9 రిమోట్ అరైవ‌ల్ గేట్లు అందుబాటులోకి వ‌స్తాయి. దీని వ‌ల్ల ప్ర‌యాణీకుల రాక‌పోక‌లు ఎంతో సులువుగా జ‌రుగుతాయి.

This website uses cookies.