Categories: LATEST UPDATES

గృహ‌ప్ర‌వేశానికి సిద్ధ‌మేనా?

తక్కువ వడ్డీ రేట్లు మరియు క‌రోనా రోజుల నుంచి పెరిగిన డిమాండ్ కార‌ణంగా ఈ సంవత్సరం గృహ అమ్మకాలు పుంజుకున్నాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, రాబోయే పండుగ సీజన్లో ఈ ధోరణి ఊపందుకుంటుందని భావిస్తున్నారు. కొనుగోలుదారులు ఆస్తులలో పెట్టుబడి పెట్టడానికి మొగ్గు చూపుతారు, ఎందుకంటే ఇది గృహ కొనుగోళ్ల‌కు శుభకరమైన కాలంగా ప‌రిగ‌ణిస్తారు. గత రెండేళ్లుగా 6.6 శాతంగా ఉన్న గృహ రుణ వ‌డ్డీ రేట్లు ప్ర‌స్తుతం 7.9 శాతమైంది.

ఏదీఏమైనా, గృహ రుణ రేట్ల పెరుగుదల గిరాకీని దెబ్బతీయలేదు. ఎందుకంటే వడ్డీ రేట్లు క‌రోనా కంటే ముందు స్థాయి కంటే తక్కువగా ఉండ‌ట‌మే ప్ర‌ధాన కార‌ణం. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్), ఢిల్లీ-ఎన్సీఆర్‌, చెన్నై, కోల్‌క‌తా, బెంగళూరు, హైదరాబాద్, పుణె మరియు అహ్మదాబాద్తో సహా ఎనిమిది నగరాల్లో రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ డిమాండ్ పెరిగింద‌ని ప‌లు స‌ర్వేలు చెబుతున్నాయి.

పండ‌గ సీజ‌న్‌లో మార్కెట్లో కాస్త పేరున్న‌ డెవలపర్లు త‌మ ఫ్లాట్ల‌ను అమ్మేందుకు విరివిగా ప్ర‌ణాళిక‌ల్ని ర‌చించే అవ‌కాశ‌ముంది. పెరిగిన నిర్మాణ వ్య‌యం కార‌ణంగా కొంద‌రు బిల్డ‌ర్లు రేట్ల‌ను పెంచేందుకు ప్ర‌య‌త్నించే అవ‌కాశం లేక‌పోలేదు. కాక‌పోతే, హైద‌రాబాద్‌లో ఇప్ప‌టికే పెరిగిన ఫ్లాట్ల కార‌ణంగా, కొంద‌రు కొనుగోలుదారులు గృహ‌ప్ర‌వేశానికి సిద్ధంగా ఉన్న ఫ్లాట్ల‌ను కొనేందుకు మొగ్గు చూపుతున్నారు. ఈ క్ర‌మంలో అందుబాటు ధ‌ర‌లో ల‌భించే గృహాల‌కు మార్కెట్లో ఎప్ప‌టికీ గిరాకీ ఉంటుంది. వీటిని కొనుగోలు చేయ‌డానికి అధిక శాతం మంది ఆస‌క్తి చూపిస్తారు. కాక‌పోతే, ఈ త‌ర‌హా ఫ్లాట్ల‌ను నిర్మించే డెవ‌ల‌ప‌ర్లను వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు.

This website uses cookies.