హైదరాబాద్లో ఆకాశహర్మ్యాల నిర్మాణాల్లో క్యాండియర్ డెవలపర్స్ అతి తక్కువ కాలంలోనే సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. స్కై స్క్రేపర్లను ఎలా కట్టాలో తమను చూసి నేర్చుకోవాలని సాటి బిల్డర్లకు చెప్పకనే చెప్పింది. మియాపూర్లో ఏడాదిన్నరలోనే.. దాదాపు ఇరవై ఐదు అంతస్తులకు పైగా నిర్మించిన ఈ సంస్థ.. తాజాగా గచ్చిబౌలి తర్వాతి శేరిలింగంపల్లిలో క్యాండియర్ క్రీసెంట్ అనే యాభై అంతస్తుల ఆకాశహర్మ్యానికి శ్రీకారం చుట్టింది. రెరా అనుమతి పొందిన ఈ ప్రాజెక్టు విశిష్ఠతలేమిటో చూసేద్దామా..
ఆధునిక జీవనశైలికి అనుగుణంగా కళ్లు చెదిరే, విలాసవంతమైన, సకల సౌకర్యాలూ ఆకాశహర్మ్యంలో నివసించాలనుకునేవారు.. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా శేరిలింగంపల్లిలో క్యాండియర్ డెవలపర్స్ అండ్ బిల్డర్స్ నిర్మిస్తున్న క్యాండియర్ క్రెసెంట్ ప్రాజెక్టును సందర్శించాల్సిందే. శాంక్టా మారియా స్కూల్ పక్కనే మొత్తం ఐదున్నర ఎకరాల స్థలంలో ఐదు భవనాలతో, అత్యంత సౌకర్యవంతంగా ఉండేలా ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంటోంది. ఇందులో సుమారు 1230 యూనిట్లు అందుబాటులోకి రానున్నాయి. అన్నీ 3 బీహెచ్ కే ఫ్లాట్లే కావడం విశేషం. ఫ్లాట్ల విస్తీర్ణం.. 1601 చదరపు అడుగుల నుంచి 2656 చదరపు అడుగుల్లో ఉన్నాయి.
2022 మేలో ప్రారంభమైన ఈ ప్రాజెక్టును 2025 డిసెంబర్ నాటికి పూర్తి చేసి అప్పగించేందుకు బిల్డర్లు ప్రణాళికరూపొందించుకున్నారు. క్యాండియర్ క్రెసెంట్ లో నివసించేవారు గౌరవనీయమైన, సౌకర్యవంతమైన జీవనశైలిని ఆస్వాదిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. పిల్లల కోసం ఆటస్థలంతో పాటు స్విమింగ్ పూల్ ఉంది. క్రీడల పట్ల ఆసక్తి ఉన్న వారి కోసం ఫుట్ బాల్ ఫీల్డ్, స్క్వాష్ కోర్టు, ఏరోబిక్స్ రూం, బాస్కెట్ బాల్ కోర్టు, బ్యాడ్మింటన్ కోర్టులు ఉన్నాయి. వీటితో పాటు ఏటీఎం, బార్బెక్యూ ఏరియా, కాన్ఫరెన్స్ రూమ్ సదుపాయాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. బోర్డ్ గేమ్స్ తోపాటు పెర్గోలా, మెడికల్ స్టోర్, ఫార్మసీ, ఎంట్రెన్స్ లాబీ, ఫ్లవర్ గార్డెన్, టేబుల్ టెన్నిస్, స్పా, సెలూన్, సెక్యూరిటీ కేబిన్, టెర్రస్ గార్డెన్, స్టీమ్ రూం; సౌనా బాత్, కార్ పార్కింగ్, క్లబ్ హౌస్, బాంకెట్ హాల్, యాంఫిథియేటర్, ఇండోర్ గేమ్స్ వంటి చాలా సౌకర్యాలు కల్పిస్తున్నారు.
లొకేషన్ పరంగా కూడా శేరిలింగంపల్లి మంచి ఏరియాలో ఉంది. హైదరాబాద్ లోని అన్ని ప్రాంతాలకు చక్కని కనెక్టివిటీ కలిగి ఉంది. ప్రముఖ షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లు, పాఠశాలలు, ఆసుపత్రులు ఈ ప్రాజెక్టుకి అత్యంత సమీపంలో ఉన్నాయి. ఇన్ని సౌకర్యాలున్న ఈ ప్రాజెక్టులో ఫ్లాట్ ధర చదరపు గజానికి రూ.6,900గా నిర్దారించారు. 1601 చదరపు అడుగుల ఫ్లాట్ ధర దాదాపు రూ.1.10 కోట్లు కాగా.. గరిష్ఠ ఫ్లాటు 2656 చదరపు అడుగుల సైజులో నిర్మిస్తున్నారు. ప్రస్తుత ధర రూ.1.83 కోట్లుగా ఖరారు చేశారు. క్రీసెంట్ పై అంతస్తు నుంచి హైదరాబాద్ మొత్తం కనిపించే అవకాశం ఉన్నందు వల్ల.. నలభై ఐదు నుంచి యాభై అంతస్తుల ఎత్తులో ఫ్లాట్లను కొనేందుకు అధిక శాతం మంది బయ్యర్లు ఆసక్తి చూపిస్తున్నారని సమాచారం. కాకపోతే, ఇప్పటికే ఈ ఎత్తులో ఫ్లాట్లు అమ్ముడయ్యాయని తెలిసింది.