సబ్ కాంట్రాక్టర్ ను దాదాపు రూ.3 కోట్ల మేర మోసం చేసిన వ్యవహారంలో ఓ కన్ స్ట్రక్షన్ కంపెనీపై కేసు నమోదైంది. పంచకుల మున్సిపల్ కార్పొరేషన్ భవన నిర్మాణానికి సంబంధించి వాసు కన్ స్ట్రక్షన్స్ కంపెనీకి టెండర్ ఖరారైంది. అయితే, సదరు సంస్థ ఆ టెండర్ ను అంబాలకు చెందిన బల్బీర్ అనే సబ్ కాంట్రాక్టర్ కు అప్పగించింది. తమకు వచ్చిన టెండర్ ను సబ్ కాంట్రాక్ట్ ఇస్తున్నామని.. కార్పొరేషన్ నుంచి డబ్బులు రాగానే చెల్లిస్తామని పేర్కొంది. బల్బీర్ ఇందుకు అంగీకరించి దాదాపు రూ.2.75 కోట్ల మేర పనులు పూర్తి చేశారు. అనంతరం డబ్బులు గురించి వాసు కన్ స్ట్రక్షన్స్ కంపెనీని సంప్రదించగా.. ఇంకా బిల్లు రాలేదని, రాగానే చెల్లిస్తామని కంపెనీ యజమానులు సతీశ్ మోంగా, రవి మోంగా బదులిచ్చారు. వీరి వ్యవహారం పై అనుమానం రావడంతో బల్బీర్ మున్సిపల్ ఆఫీసుకు వెళ్లి వాకబు చేశారు. అప్పటికే బిల్లు మొత్తం చెల్లించేశారని.. సబ్ కాంట్రాక్టర్ గా తన పేరు కూడా అక్కడ లేదని తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
This website uses cookies.