Categories: Rera

రిజిస్టర్ కాకుండా యాడ్స్ ఇస్తే చర్యలు

రెరాలో రిజిస్టర్ కాకుండా వాణిజ్య ప్రకటను చేసుకునే ప్రాజెక్టులపై కఠిన చర్యలు చేపడతామని రెరా హెచ్చరించింది. రెరాలో ప్రాజెక్టు వివరాలు నమోదు చేయించకుండా పలు కంపెనీలు వార్తాపత్రికల్లో ప్రకటనలు ఇస్తున్నాయని.. రెరా రిజిస్ట్రేషన్ నెంబర్ లేకుండా యాడ్స్ ఇస్తే చర్యలు తీసుకుంటామని స్పష్టంచేసింది. కొనుగోలుదారులు కూడా రెరా రిజిస్టర్ నెంబర్ ఉందో లేదో చూసుకుని అందుకు అనుగుణంగా వ్యవహరించాలని సూచించింది. ఈ మేరకు మహారాష్ట్ర రెరా ఓ ప్రకటన విడుదల చేసింది. రెరా రిజిస్ట్రేషన్ నెంబర్ లేకుంటే సదరు ప్రాజెక్టుకు రెరా అనుమతి లేదనే విషయం గుర్తుంచుకోవాలని పేర్కొంది. ఇలా రెరాలో నమోదు కాకుండా ప్రకటనలు ఇచ్చిన ప్రాజెక్టుల వ్యవహారాన్ని సుమోటాగా తీసుకుని ఇప్పటికే పలు కంపెనీలకు మహారెరా నోటీసులు జారీ చేసింది.

This website uses cookies.