నిర్దేశిత గడువులోగా భూ హక్కులను హౌసింగ్ సొసైటీ పేరుకు బదలాయించనందుకు ఓ నిర్మాణ కంపెనీకి చెందిన ఇద్దరు భాగస్వాములపై కేసు నమోదైంది. బెంగళూరు శీతల్ నగర్ లోని ఓ హౌసింగ్ సొసైటీకి చెందిన సల్మాన్ ఇస్లాముద్దిన్ ఖురేషీ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బెంగళూరు మీరా రోడ్ పోలీసులు ఎస్ఎస్ డెవలపర్స్ పార్టనర్లు చందుబాయ్ పటేల్, ఎంసీ పటేల్ పై కేసు నమోదు చేశారు.
మూడు దశాబ్దాల క్రితం తమ సొసైటీ ఏర్పడిందని.. కానీ భూ హక్కుల బదలాయింపునకు సంబంధించిన కన్వేయన్స్ డీడ్ ను తమకు అప్పగించలేదని పేర్కొంటూ ఖురేషీ ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధిచిన అన్ని డాక్యుమెంట్లను ఆయన జతపరిచారు. కన్వేయన్స్ అంటే.. స్థిరాస్తి యాజమాన్య హక్కులను కొనుగోలుదారుకు బదిలీ చేసే ఒప్పందపత్రం. ప్రాజెక్టు పూర్తయిన తర్వాత నాలుగు నెలల్లోగా ఈ పని పూర్తి చేయాలి. అయితే, ఎస్ఎస్ డెవలపర్స్ ఈ పని చేయడంలో విఫలం కావడంతో ఖురేషీ పోలీసులను ఆశ్రయించారు. అన్ని వివరాలను పరిశీలించిన పోలీసులు ఆ ఇద్దరిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
This website uses cookies.