Categories: TOP STORIES

వెల్లువెత్తిన పెట్టుబడులు

  • తొలి త్రైమాసికంలో రూ.9,124 కోట్ల రియల్ పెట్టుబడులు
  • రెసిడెన్షియల్ విభాగంలోకి రూ.5,743 కోట్లు

రియల్ రంగం ఈ ఏడాది తొలి త్రైమాసికంలో అదరగొట్టింది. జనవరి-మార్చి త్రైమాసికంలో రియల్ ఎస్టేట్ రంగంలోకి ఏకంగా రూ.9,124 కోట్ల పెట్టబడులు వెల్లువెత్తాయి. గతేడాది తొలి క్వార్టర్లో రూ.8,830 కోట్ల పెట్టుబడులు రాగా, ఈ సారి దానిని మంచి పెట్టుబడులు రావడం విశేషం. ఈ మొత్తంలో రెసిడెన్షియల్ రంగానిదే అధిక వాటా అని కుష్ మన్ అండ్ వేక్ ఫీల్డ్ పేర్కొంది.. తొలి త్రైమాసికంలో వచ్చిన రూ.9,124 కోట్లలో రెసిడెన్షియల్ విభాగంలోకి రూ.5,743 కోట్ల పెట్టుబడులు వచ్చాయని తన తాజా నివేదికలో వెల్లడించింది. మొత్తం పెట్టుబడుల్లో ఇది 63 శాతం కావడం గమనార్హం. గతేడాది ఇదే సమయంలో రెసిడెన్షియల్ పెట్టుబడులు రూ.1735 కోట్లు కాగా, ఈ సారి మూడింతలకు పైగా పెరిగాయి.

ఇక ఆఫీస్ విభాగంలోకి గతేడాది క్యూ1లో రూ.2,180 కోట్ల పెట్టుబడులు రాగా, ఈసారి అవి రూ.2,248 కోట్లకు పెరిగాయి. అయితే, బహుళ వినియోగ ప్రాజెక్టుల్లో పెట్టుబడులు మాత్రం తగ్గాయి. గతేడాది క్యూ1లో ఇవి రూ.1,645 కోట్లు ఉండగా.. ఈసారి రూ.865 కోట్లకు తగ్గాయ్. ఇక ఇండస్ట్రియల్ అండ్ లాజిస్టిక్స్ విభాగంలోకి 2023 క్యూ1లో రూ.2,170 కోట్ల పెట్టుబడులు రాగా, ఈసారి రూ.268 కోట్లకు పరిమితమయ్యాయి. ‘భారత రియల్ రంగంలో పెట్టుబడుల ప్రవాహానికి 2024 క్యూ1 దన్నుగా నిలిచింది. రెసిడెన్షియల్ విభాగం ఆధిపత్యం చెలాయించింది’ అని కుష్ మన్ అండ్ వేక్ ఫీల్డ్ క్యాపిటల్ మార్కెట్స్ ఎండీ సోమీ థామస్ పేర్కొన్నారు.

This website uses cookies.