Categories: LATEST UPDATES

రియల్ సేల్స్‌లో  సీబీఆర్ఈ టాప్

మన దేశంలో వాణిజ్య రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్ మెంట్ అమ్మకాల్లో ప్రముఖ సంస్థ సీబీఆర్ఈ వరుసగా ఏడో సంవత్సరం అగ్రస్థానంలో నిలిచింది. ఈ విషయాన్ని ఎంఎస్ సీఐ రియల్ అసెట్స్ సంస్థ వెల్లడించింది. 63 శాతం మార్కెట్ షేర్ తో సీబీఆర్ఈ టాప్ లో దూసుకెళ్తోందని పేర్కొంది. ఆఫీస్ (95 శాతం), డెవలప్ మెంట్ సైట్ లేదా ల్యాండ్ (63 శాతం), ఇండస్ట్రియల్ (57 శాతం) వాటా కలిగి ఉందని వివరించింది.

‘మేం వరుసగా ఏడోసారి వాణిజ్య రియల్ ఎస్టేట్ పెట్టుబడి రంగంలో అగ్రస్థానం సాధించాం. ఇది అన్ని రంగాల్లో మా పెట్టుబడులను మరింత మెరుగుపరచడానికి, ఈ పరిశ్రమలో అత్యుత్తమ వాటిని అందించడానికి ఎంతగానో దోహదపడుతుంది’ అని సీబీఆర్ఈ ఇండియా చైర్మన్ అండ్ సీఈఓ అన్షుమన్ మ్యాగజైన్ పేర్కొన్నారు. క్లయింట్లు తమపై ఉంచిన విశ్వాసానికి ఈ ర్యాంకే నిదర్శనమని సీబీఆర్ఈ ఇండియా క్యాపిటల్ మార్కెట్స్ అండ్ ల్యాండ్ మేనేజింగ్ డైరెక్టర్లు గౌరవ్ కుమార్, నిఖిల్ భాటియా తెలిపారు. కాగా, సీబీఆర్ఈ గతేడాది ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య రియల్ ఎస్టేట్ పెట్టుబడి అమ్మకాల్లో అగ్రశ్రేణి సంస్థగా ఉంది. వరుసగా ఆ స్థానంలో 12 ఏళ్ల నుంచి కొనసాగుతుండటం విశేషం. ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాపర్టీ విభాగాల్లో 23.4 శాతం వాటా సీబీఆర్ఈ కలిగి ఉందని ఎంఎస్ సీఐ పేర్కొంది. ఆఫీస్ (25.8 శాతం), ఇండస్ట్రియల్ (31.3 శాతం), రిటైల్ (23.5 శాతం), మల్టీ ఫ్యామిలీ (17.8 శాతం), హోటళ్లు (20 శాతం) అనే ఐదు అతిపెద్ద ప్రాపర్టీ విభాగాల్లో సీబీఆర్ఈ అగ్రభాగాన ఉంది.

This website uses cookies.