Categories: Celebrity Homes

Celebrity Homes నా ఇల్లే నా సెలవు ప్రదేశం

  • రియల్ ఎస్టేట్ గురుతో
    ప్రముఖ నటి కాజల్ అగర్వాల్

ప్రముఖ నటి కాజల్ అగర్వాల్ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలు తిరిగి, ఎన్నో ఇళ్లు చూశారు. కానీ సొంతిల్లు ఎక్కడ ఉండాలనుకుంటున్నారో తెలుసా? ‘మీరు నా నుంచి ఈ ఆర్థిక కేంద్రాన్ని (ముంబై) తీసివేయలేరు. నేను ఇక్కడే పుట్టాను. నా స్థలం ఎప్పుడూ మీటింగ్ ప్యాడ్ లా ఉంటుంది. నేను గుర్తుచేసుకునే ప్రతి పెద్ద వేడుకా ఇక్కడే జరుపుకొన్నాను’ అని వెల్లడించారు. తన లివింగ్ గది ఎలా ఉంటుందో చెబుతూ.. ‘సగం తయారుచేసినవి, సగం కొనుగోలు చేసినవి.. వీటితోనే నా లివింగ్ రూమ్ ని డెకరేట్ చేశాను. సింప్లిసిటీ ఎప్పుడూ నా మదిలో మెదులుతూ ఉంటుంది. నేను ప్రత్యక్షంగా తయారు చేసిన కొన్ని ఫర్నిచర్లు ఉన్నాయి. నా గదిలో ప్రశాంతమైన అనుభూతి వస్తుందని కచ్చితంగా చెబుతాను. వినియోగించే వస్తువులనే డెకరేషన్ కి వినియోగించాను. నా సెంట్రల్ టేబుల్ పైకి తెరుచుకుంటుంది. ఈ రూపం కావాలనే అనుకుని పూర్తి చేశాను’ అని తెలిపారు.

కాజల్ ఇంట్లో ఓ సమావేశ గది ఉంది. ‘ఇది కథలు వినడం కోసం. ఇక్కడ నాకు నచ్చిన, నేను మెచ్చిన పుస్తకాలతో కూడిన లైబ్రరీ ఉంది. అది నన్ను బాగా కనెక్ట్ చేస్తుంది. కస్టమ్ మేడ్ రగ్గు లేదా జైపూరీ తయారీ కార్పెట్ అంటే నాకు చాలా ఇష్టం. నా వరకు ప్రతిదీ ఆకర్షణీయంగా, సౌందర్యంగా ఉండాలి. అన్నింటి కంటే పని చేయడానికి ఏదో స్థలం ఉందిలే అనేలా కాకుండా కాజల్ జీవితానికి సంబంధించిన సృజనాత్మకత వెల్లివిరిసేలా ఈ స్థలం ఉండాలనేదే నా అభిమతం. నా దగ్గర రెండు గాజు ముక్కల మధ్య చేతితో చిత్రించిన నార ఉంది. దానిని తెరవలేం. ఇంకా దానికి వెనకాల లైట్లు ఉంటాయి. వాటిని వెలిగిస్తే బంగారు నంది రూపం కనిపిస్తుంది. నాకు ఇటుకలంటే చాలా ఇష్టం. నా ఇటుకల గోడ కోసం ఇతర గోడలకు కావాలనే తెల్ల రంగు వేయించాను. దీంతో నా గోడ ఓ స్టార్ పీస్ లా కనిపిస్తుంది’ అని కాజల్ వివరించారు
కాజల్ ఇంట్లో ఫంక్షనల్ బార్ కూడా ఉంది. శుక్రవారం రాత్రి ఆమె ఆ గదిలో ఉంటూ సరదాగా కాక్ టెయిల్ కలపడాన్ని బాగా ఎంజాయ్ చేస్తారు. అక్కడ ఒక మెటల్, గ్లాస్ టేబుల్ ఉంది. ఫ్లోరింగ్ పై గోల్డెన్ గ్లేజ్ లు ఉన్నాయి. ‘నిజం చెప్పాలంటే నేను చాలా కష్టమైన జీవితాన్ని జీవిస్తున్నాను. పని అనేది నాకు ఉన్న పెద్ద వ్యసనం. నా ఇల్లు నాకు ప్రతిరోజూ సేదతీరే సెలవు ప్రదేశంగా మారుతోంది. షూటింగ్ లో అలసిపోయిన తర్వాత చాయ్ కోసం చూస్తాను. ప్రతిరోజూ నేను ఇంట్లో పాత్రల శబ్దాలు, నా ఇంటి సిబ్బంది మాటలు, సంగీతంతో నిద్ర లేస్తాను. ఇది ఎంతో ఫన్నీగా అనిపించవచ్చు. కానీ ఇది నాకెంతో ఇష్టమైన నా ఇల్లు’ అని పేర్కొన్నారు.

This website uses cookies.