మినిమలిజంతోపాటు తెలుపు, బూడిద రంగు నేపథ్య గృహాల కాలంలో నటి అహానా కుమ్రా ఇల్లు శక్తివంతమైన స్వీయ వ్యక్తీకరణకు ఓ వెలుగురేఖలా నిలుస్తుంది. అటు బుల్లితెర, ఇటు వెండితెరపై బోలెడు పాత్రల ద్వారా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆహానా.. రంగులపై ఉన్న ప్రేమను మాత్రమే కాకుండా ఆమె ప్రత్యేకమైన వ్యక్తిత్వం, స్వాంతంత్ర్యాన్ని కూడా ప్రతిబింబించే జీవన స్థలాన్ని రూపొందించుకున్నారు. ఆహానా.. ముంబైలోని పింక్ ప్యాడ్ యువరాణి.
‘నాకు పింక్ అంటే చాలా ఇష్టం. ఇది నా ఆల్ టైమ్ ఫేవరేట్ కలర్. అందుకే ఇది ముందు భాగంలో ఉంది’ అని ఆహానా తన కళ్లలో గర్వం తొణికిసిలాడుతుండగా చెప్పారు. వాస్తవానికి ఆకర్షణీయమైన ఆమె ఇంటి పింక్ డోర్ అందం కంటే కూడా చాలా ఎక్కువ. అది ఆమె వ్యక్తిగత శైలిని ధైర్యంగా ప్రకటించడమే. ఆ పింక్ డోర్ అనేది ఆహానాకు తన సొంత స్థలంలోకి వెచ్చగా స్వాగతించే ద్వారం. అది సంప్రదాయ నిబంధనలను ధిక్కరించే ఓ అభయారణ్యం.. ఆ రంగు పట్ల ఆమె నిరాధారమైన ప్రేమకు నిదర్శనం.
ఆహానా విలక్షణమైన అభిరుచికి, ఆమె ఇంటిని ఆకర్షణీయంగా మార్చాలనే కోరికకు ఈ అపార్ట్ మెంట్ నిదర్శనం. నిజానికి ఆహానా తన ఇంటిని తెల్లగా ఉండాలని ఎప్పుడూ ఊహించుకునేవారని ఆమె డిజైనర్ చెప్పారు. అయితే, వారు మెలో టోన్లు, యాక్సెంట్ కలర్స్ వినియోగించి ఇంటికి ఓ ఆకర్షణీయమైన రూపు తెచ్చారు. దీంతో కళ్లు చెదిరే రీతిలో ఆమె ఇల్లు రూపుదిద్దుకుంది.
కలర్ ప్యాలెట్లు, టెక్చర్ల అన్వేషణతో ఆహానా ఇంటి డిజైన్ ప్రయాణం ప్రారంభమైంది. తొలుత తెలుపు రంగు అనుకున్నారు. అపార్ట్ మెంట్ అనేది అనేక కథలు, భావోద్వేగాల కాన్వాస్ వంటిది. లివింగ్ రూమ్ లో ఖరీదైన పింక్ సోఫాలు ఉన్నాయి. చూడటానికి కాస్త తక్కువ ఆకర్షణ కలిగి ఉన్నప్పటికీ, ఆ గదిలోని న్యూట్రల్ గోడలకు సరిగ్గా సరిపోయాయి. పింక్ థీమ్ ను పూర్తి చేయడానికి జాగ్రత్తగా ఎంచుకున్న కళా ఖండాలు ఆ గోడలకు కొత్త వన్నె తెచ్చాయి. అవి ఒక్కోటి ఒక్కో కథ చెబుతాయి. అబ్‌స్ట్రాక్ట్ పెయింటింగ్‌ల నుంచి ఫొటో గ్రాఫ్ ల వరకు గదిలోని ప్రతి వస్తువూ ఆహానా ప్రయాణం, అభిరుచులను ప్రతిబింబిస్తాయి. బెడ్ రూమ్ విషయానికి వస్తే.. ప్రశాంతత కలిగిన అభయారణ్యంగా అనిపిస్తుంది. ఇక్కడ పింక్ మృదువైన రంగులలో ఉంటుంది. పాస్టల్ త్రోలు, సున్నితమైన కుషన్లు ప్రశాంతమైన విశ్రాంతి వాతావరణాన్ని సృష్టిస్తాయి. ఈ గది నగర జీవితంలోని హడావిడి నుంచి సేద తీరేలా రూపొందించారు. ఆహానా విశ్రాంతి తీసుకోవడానికి, తనను తాను రీచార్జ్ చేసుకోడానికి తగిన స్థలం ఇది.
ఆహానా అనేక సంవత్సరాలుగా సేకరించిన డెకరేషన్ వస్తులు ఈ అపార్ట్ మెంట్ ప్రత్యేకమైన లక్షణాల్లో ఒకటి. పాతకాలపు అన్వేషణల నుంచి సమకాలీన సంపద వరకు ప్రతి భాగం ఆ స్పేస్ కు ఓ చక్కని ఆకృతి, చరిత్రను జోడిస్తాయి. ఇవన్నీ ఆ అపార్ట్ మెంట్ అందాన్ని మరింత ఇనుమడింపజేయడమే కాకుండా ఆహానా వ్యక్తిగత అభిరుచులు, అనుభవాలను తెలియజేస్తాయి.
ఈ గులాబీ స్వర్గంలో నివసిస్తున్న ఆహానా తన చుట్టూ ఉన్నవారికి కూడా స్ఫూర్తినిచ్చింది. ఆమె స్నేహితులు చాలా మంది.. ప్రత్యేకించి వైవాహిక జీవితంలో ఉన్నవారు కూడా ఆమె ఆ రంగును నిర్భయంగా సొంతం చేసుకున్నందుకు ప్రశంసలు కురిపించారు. ‘పెళ్లయిన నా గర్ల్ ఫ్రెండ్స్ చాలామంది ఈ పింక్ హోమ్ నుంచి ప్రేరణ పొందారు. పాపం వారి భర్తల పరిస్థితి ఏమిటో’ అని ఆహానా చమత్కరించారు. మొత్తానికి ఆహానా కుమ్రా పింక్ ప్రిన్సెస్ ప్యాడ్ అనేది రంగు, వ్యక్తిత్వం, వ్యక్తిగత అభిరుచుల సమ్మేళనం. ఇది ఓ డైనమిక్ జీవన స్థలం.. ఆమె వ్యక్తిత్వం గురించి గొప్పగా మాట్లాడే గృహం. రోజువారీ గోలల నుంచి తప్పించుకోవడానికి, అన్ని వేడుకలను గులాబీమయంగా జరుపుకునే వ్యక్తిగత స్థలం.