poulomi avante poulomi avante

వాస్తును కాదని ఇల్లు కొన్నాం

రియల్ ఎస్టేట్ గురుతో
ప్రముఖ టీవీ నటి మందిరా బేడీ

క్రికెట్ వ్యాఖ్యానంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ప్రముఖ టీవీ నటి మందిరా బేడీ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. పురుషులకు మాత్రమే పరిమితమైన క్రికెట్ లో ప్రవేశించి.. తన వ్యాఖ్యానంతో ఆటకు గ్లామర్ తీసుకొచ్చారు. అటు క్రికెట్ వ్యాఖ్యాతగా.. ఇటు టీవీ నటిగా పేరు తెచ్చుకున్న ఆమె.. ఇంటీరియర్ లోనూ తనకు తానే సాటి అని నిరూపించుకున్నారు. ‘రామ’ అని పేరు పెట్టుకున్న తన ఇంటికి సంబంధించిన పలు అంశాలను ఆమె ముచ్చటించారు.

‘17 ఏళ్ల క్రితం నేను నా దివంగత భర్త ఇంటికి మారినప్పుడు అది ఓ చిన్న 2 బీహెచ్ కే అపార్ట్ మెంట్. కొంచెం ఇరుకైనది. అందుకే మేం ఎప్పుడైనా ఇంకా పెద్ద ఇంటికి వెళ్లాలనుకున్నాం. ఆ రోజు రానే వచ్చింది. ఓ మధ్యవర్తి ఈ ఇంటిని చూపించాడు. అప్పడు స్విమింగ్ పూల్ సగం మాత్రమే పూర్తయి ఉంది. నిజానికి ఈ స్థలం త్రిభుజాకారంలో ఉంది. వాస్తు ప్రకారం అది మంచిది కాదు. అయినప్పటికీ మేం ముందడుగు వేసి దీనిని కొనుగోలు చేశాం. డబ్బులు వచ్చినప్పుడల్లా దీనిని అప్ గ్రేడ్ చేశాం. దాదాపు ఏడాది పాటు పని నడిచింది’ అని ఆమె వెల్లడించారు.

మందిర తన ఇంటికి సహోద్యోగులను ఆహ్వానిస్తారు. అయినప్పటికీ తన వ్యక్తిగత అభిరుచులకు అనగుణంగానే ఇంటిని తీర్చిదిద్దారు. ఇంటీరియర్ ను స్వయంగా డిజైన్ చేసుకున్నారు. పాక్షింగా అలంకరించిన చిన్న ఇంటి నుంచి విలాసవంతమైన అపార్ట్ మెంట్ వరకు అన్నింటా మందిర తన ముద్ర కలిగి ఉన్నారు. ‘దీనికి చాలా చరిత్ర ఉంది. మేం ప్రారంభించినప్పుడు నేను ప్రతిదానిని సరిపోల్చడంపైనే నిమగ్నమయ్యాను. ఎంట్రీ గేట్ నుంచి లైట్ వరకు అన్నీ సరిపోల్చాను. ఇంకా నా చుట్టూ సినర్జీకి రంగులు కావాలి. వాటిని నా కుషన్ కవర్లపై అమలు చేశాను’ అని తెలిపారు.

మందిర ఇంటి రెండో అంతస్తుకు వెళ్లే గ్యాలరీ గోడ బ్లాండ్ గోడలా మార్చేసింది. ఆమె తన ఇంట్లోని లివింగ్ స్పేస్ ను పూర్తిగా తన వ్యక్తిగత అభిరుచులకు అనుగుణంగా తీర్చి దిద్దుకున్నారు. అక్కడ ఆమె ఎలాంటి వాల్ పేపర్లు వినియోగించలేదు. కానీ తన కుటుంబానికి సంబంధించిన ఫొటోలతో నింపేసి, తన ఇంట్లో అత్యంత దృష్టి సారించే ప్రాంతంగా మార్చేశారు. టైపోగ్రఫీ, ఇష్టమైన కుటుంబ ఫొటోలతో ప్రయోగాలు చేశారు. ‘మరో గోడ అసమానంగా ఉంది. మీరు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మొక్కలను అక్కడ చూస్తారు. మా వద్ద బెస్ట్ సెల్లర్లతో కూడిన లైబ్రరీ కూడా ఉంది. నా అభిరుచికి కొన్ని ఆధ్యాత్మిక, స్వీయ స్వస్థత పుస్తకాలు కూడా ఉంటాయి. అంతేకాకుండా సృజనాత్మక విజువలైజేషన్ ఇంకా క్రికెట్ కి సంబంధించినవి కూడా.
మందిర కోల్ కతాలో జన్మించారనే సంగతి ఆమె అభిమానుల్లో చాలా మందికి తెలియదు. ‘నా ఇంట్లో కలకత్తా ప్రభావం చాలా ఉంటుంది. నా మొదటి ఇంటి గురించి చెప్పాలంటే ఓ గది ఫ్లాట్ ను అద్దెకు తీసుకున్నాను. టీవీ కెరీర్ ను అలా ప్రారంభించాను. ఫ్లాట్ ఆకృతి, వివిధ అంతస్తులు, రంగులు, ఎంపికలు, బుద్ధులు.. ఇవే నాకు అత్యంత ముఖ్యమైన ఐదు అంశాలు. నా ఇంటి కథను ఒక్క మాటలో చెప్పాలంటే.. ఈదు లేదా మునుగు. ప్రస్తుతం స్విమింగ్ పూల్ లేదు.. కానీ నా కుటుంబం ఇంకా సానుకూల కోరికలతో ఈదుతోంది’ అని చెప్పి ముగించారు.
spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles