poulomi avante poulomi avante

ప్ర‌ముఖ డిజైన‌ర్ నీతా లుల్లా.. హైద‌రాబాద్‌ వైపు చూస్తుందా?

బ్రో సినిమాలో న‌టించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు స్ట‌యిలింగ్ చేసిన నీతా లుల్లా కాస్ట్యూమ్ డిజైన‌ర్ అయినప్ప‌టికీ, ఆమె ఇల్లును చూస్తే అర్బ‌న్ ప్ర‌ణాళిక‌కు ప్ర‌తీక‌గా నిలుస్తుంది. వార‌స‌త్వ సంప‌ద కొట్టొచ్చిన‌ట్లు క‌నిపిస్తుంది. త‌న ఇంటి డిజైన్ల‌ను చూస్తుంటే మీకు స‌మ‌య‌మే తెలియ‌దంటే న‌మ్మండి. కావాలంటే, ఆమెను అడిగి ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన అంశాల్ని తెలుసుకుందామా..

నేను రెండు ర‌కాల ఇళ్ల‌ల్లో పెరిగాను. మొద‌టిది హైద‌రాబాద్ న‌డిబొడ్డున ఉన్న అపార్టుమెంట్‌. అది సికింద్రాబాద్ చేరువ‌లో ఉంది. కానీ, నా బాల్యంలో ఉన్న ఇంటి పేరు బాల్కేశ్వ‌ర్‌. దానికి ముద్దుగా గోపాల్ భ‌వ‌న్ అని పేరు పెట్టుకున్నాం. అదెంతో పెద్ద‌గా. విశాల‌మైన‌ది. ఎంత‌గా అంటే ఇంటి లోపలే బ్యాడ్మింట‌న్ ఆడుకునేవాళ్లమంటే ఒక్క‌సారి ఊహించండి. మా తాత నిర్మించిన ఆ ఇంట్లో పురాత‌న వ‌స్తువులెన్నో ఉండేవి. ఒక ర‌కంగా చెప్పాలంటే, నా చిన్న‌త‌నం అంతా ఒక క‌ళాఖండం మాదిరిగా సాగిపోయింది. వాస్త‌వానికి మా తాత క‌రాచీ నుంచి భార‌త‌దేశానికి వ‌ల‌సొచ్చారు. అందుకే, అప్ప‌టి సంస్కృతికి, స‌మ‌యానికి పెద్ద‌పీట వేసేవారు.

నీతా తాత ఆ భ‌వ‌నాన్ని ఒక బ‌డా బంగ‌ళాగా మార్చుకున్నాడు. రెండు డిన్న‌ర్ రూములు అందులో ఉండేవి. ఒక ర‌కంగా చెప్పాలంటే ఒక రాజ‌ప్ర‌సాదంలా ఉండేది. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. అందులోనే నీతా చిన్న‌ప్పుడు సైకిల్ తొక్క‌డం నేర్చుకుంది. ఆ బంగ‌ళానికి చూస్తే.. పాత‌త‌రం మ‌రియు ఆధునిక ఆర్కిటెక్చ‌ర్‌ను మిళితం చేసిన‌ట్లు ఉంటుంది. చాలా పెయింటింగ్స్ మరియు శిల్పాలు ఆమె బంగ్లాలో పాతకాలపు వాతావరణాన్ని ఆవిష్క‌రిస్తాయి.

ఆమె మాట్లాడుతూ.. బంగార‌మంటే ఎంతో సున్నిత‌మ‌ని.. అందుకే దాన్ని ప్రేమిస్తాను. నాకు పెళ్ల‌యిన‌ప్పుడు ఉమ్మ‌డికుటుంబంలో జీవించాను. వాళ్ల సౌక‌ర్యానికే ప్రాధాన్య‌త‌ను ఇవ్వ‌డంతో నా ప్రాధాన్య‌త‌ను త‌గ్గించుకున్నాను. ఆ ఇంటిని మార్చ‌డానికి పెద్ద‌గా ప్ర‌య‌త్నించ‌లేదు. చిన్న‌ప్ప‌ట్నుంచి నేను బంగ‌ళాలో నివ‌సించ‌డం అల‌వాటైంది. మా త‌ల్లిదండ్రులు సికింద్రాబాద్లోని అపార్టుమెంట్ నుంచి విశాల‌మైన ప‌చ్చ‌ద‌నం ఉండే బ‌డా బంగ‌ళాలోకి మార‌డం నాకింకా గుర్తు ఉంది. కాబ‌ట్టి, అలాంటి స్థ‌లాల్లో నివ‌సించ‌డం అల‌వాటైంది. ఎలాంటి ఉద్యోగం లేని రోజుల్లో కూడా నీతా లుల్లా అధిక స‌మ‌యాన్ని డిజైనింగ్ మీదే దృష్టి పెట్టేది. అంతేత‌ప్ప స‌మ‌యం వృథా చేసేది కాదు. కాక‌పోతే, ఇప్పుడీ స్థ‌లం నాది కాబ‌ట్టి, నాకు కావాల్సిన రీతిలో ఇంటీరియ‌ర్స్ చేసుకోగ‌ల‌ను.

ఎందుకంటే ఇది నా సొంతం స్టూడియో కాబ‌ట్టి. సౌంద‌ర్య సున్నిత‌త్వం లేకుండా నేను కొంత స్థ‌లాన్ని కూడా డిజైన్ చేయ‌లేను. ఈ స్టూడియోనే నాకు రెండు ఇల్లు అని అంటాను. మొత్తం కాన్సెప్టు నాకు ఎంతో వ్య‌క్తిగ‌త‌మైన‌ది. నా స్టైల్‌ని తెలియ‌జేస్తుంది. అయితే, నేను ఇప్ప‌టికీ ఇప్పుడే ఫ్రాన్స్‌లో ఇల్లు క‌ట్టుకోవాల‌ని అనుకోవ‌ట్లేదు. స‌ముద్రం ద‌గ్గ‌ర కొంత ప్ర‌శాంత‌మైన స్థ‌లంలో ఉండేందుకు స‌ర్దుకుపోతాను. ఇంటీరియ‌ర్ డిజైనింగ్‌కు సంబంధించిన సాంకేతిక అంశాల‌పై ఆమెకు పూర్తి ప‌ట్టు ఉంది. కాక‌పోతే, ఇంటీరియ‌ర్ డిజైనింగ్ కాస్త భిన్న‌మైన వ్య‌వ‌హారం. ఇక్క‌డ కాస్త క్రియేటివిటికీ స్థానం క‌ల్పించాలి. పాత‌కాల‌పు ఫ‌ర్నీచ‌ర్‌ను ప్ర‌త్యేకంగా తీర్చిదిద్దాల‌నే అంశం సాధ్యం కాక‌పోతే, నేను మూడు రోజులు వ‌రుస‌గా కూర్చోని చేశాను.

శ్రీదేవి ఇల్లంటే ఇష్టం..

ఏ సెల‌బ్రిటీ ఇల్లు ఇష్ట‌మంటే.. చెన్నైలోని శ్రీదేవి ఇల్లంటే ఇష్ట‌మని నీతా లుల్లా తెలిపారు. ఇంటి ముందు భాగం, అద్దాల‌తో కూడుకున్న త‌లుపులు, ఆర్ట్ వ‌ర్క్‌, గోడ‌ల‌కు లైనింగ్ వంటివి భ‌లె ఉంటాయ‌ని వివ‌రించారు. హేమామాలిని ఇల్లును చూస్తే వావ్ అనాల్సిందే అని అంటారు. ఆ ఇంట్లో భార‌తీయ‌త ఉట్టిప‌డుతుంది.. వృందావ‌న్ వైబ్స్ క‌నిపిస్తాయి. బొమ్మల నుండి ఇత్తడి లాంతర్లు మరియు పెయింటింగ్‌ల వరకు మరియు మరెన్నో ఆ ఇంట్లో ఉన్నాయి. దక్షిణ భారత నటుడు అల్లు అర్జున్ ఇల్లు ఈ లోకంలో లేదు. కాబట్టి మినిమలిస్ట్ కానీ పెట్టె ఆకారం మనోహరంగా ఉంది. ఎక్స్‌టీరియ‌ర్ మొత్తం శ్వేత‌వ‌ర్ణంలో ఉంటుంది. ఆ ఇంట్లో ఎంతో సానుకూత క‌నిపిస్తుంది. బాల్యంలో ఉన్న‌ప్పుడు చ‌దువుల నుంచి దూరంగా ఉండేందుకు ముంబైకి పారిపోవ‌డానికి ప్ర‌య‌త్నించేది. సికింద్రాబాద్‌లో త‌ను సెయింట్ ఆండ్రూస్ స్కూల్‌లో చ‌దివేది. ఆత‌ర్వాత ముంబైలో స్థిర ప‌డ్డాక త‌ను హైద‌రాబాద్‌ను మిస్ అయ్యేది. ఉదాహ‌ర‌ణ‌కు త‌ను ఇక్క‌డున్న‌ప్పుడు ఇడ్లీ సాంబ‌ర్ తినేది. అలాంటిది ముంబైలో మిస్ అవుతోంది. అయితే, త‌ను హైద‌రాబాద్‌కి వెన‌క్కి వ‌చ్చేయాల‌ని చూస్తోంది. ఈ క్ర‌మంలో ఆమెకు హామ్స్‌టెక్ క్రియేటివ్ కాలేజీ క‌నిపించింది.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles