తరతరాలకు చెరగని చిరునామా అంటూ మెగా స్టార్ చిరంజీవి, రాంచరణ్ తేజ్ వంటి అగ్రనటులతో అట్టహాసంగా ప్రచారాన్ని నిర్వహిస్తూ.. సామాన్యులతో పాటు మధ్యతరగతి పెట్టుబడిదారుల్ని ఆకర్షించే.. సువర్ణభూమి సంస్థపై పోలీసు కేసు నమోదైందని సమాచారం. ఈ సంస్థ తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ప్లాట్ల విక్రయాల పేరిట బురిడీ కొట్టించిందని.. కోట్లాది రూపాయలను వసూలు చేసి మోసం చేసిందని తెలిసింది. బోగస్ రశీదులతో మాయ చేసిందని సమాచారం. దీంతో సువర్ణ భూమి సంస్థ ఎండీతో సహా ఐదుగురి మీద జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫోర్జరీ.. చీటింగ్.. తదితర సెక్షన్ల క్రింద క్రిమినల్ కేసు నమోదైందని తెలిసింది. దీనిపై సంస్థ వివరణ తీసుకునేందుకు రెజ్ న్యూస్ ప్రయత్నించగా.. సువర్ణభూమి ప్రతినిధులు అందుబాటులో లేరు. ఈ సంస్థకు ప్రచారకర్తగా రాంచరణ్ తేజ్ వ్యవహరిస్తున్నారు. తాజా కేసు నేపథ్యంలో ఆయన సువర్ణభూమికి బ్రాండ్ అంబాసిడర్‌గా నిలుస్తారా? లేక కాంట్రాక్టుకు స్వస్తి పలుకుతారా? అనేది త్వరలో తెలిసే అవకాశముంది.
This website uses cookies.