Categories: LEGAL

ఒకరికి అమ్మిన ఫ్లాట్లు మరొకరికి తనఖా..

  • నైనెక్స్ డెవలపర్స్ పై చీటింగ్ కేసు

ఒకరికి అమ్మేసిన ఫ్లాట్లను మరో కంపెనీకి విక్రయించి పలువురు కొనుగోలుదారులను కోట్ల రూపాయల మేర మోసం చేసిన వ్యవహారంలో గురుగ్రామ్ కు చెందిన నైనెక్స్ డెవలపర్స్ కంపెనీ, దాని డైరెక్టర్లపై పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. సెక్టార్ 43కి చెందిన రాజేంద్ర శర్మ 2016లో రూ.కోటి చెల్లించి ఫ్లాట్ బుక్ చేసుకున్నారు. అనంతరం శర్మ ఫ్లాట్ తోపాటు మరో 21 మందికి విక్రయించిన ఫ్లాట్లను ఓ ప్రైవేటు సంస్థకు తనఖా పెట్టారు. 2019లో ఈ విషయం తెలుసుకున్న శర్మ.. పోలీసు కేసు పెడదామని భావించగా, బిల్డర్ సెటిల్మెంట్ చేస్తానని హామీ ఇచ్చారు.

కానీ రోజులు గడిచినా ఎలాంటి సెటిల్మెంట్ జరగలేదని.. తనకు, తన భార్యకు ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయ్యాయని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో శర్మ పేర్కొన్నారు. ‘2016లో సెక్టార్ 76లో రూ.కోటి చెల్లించి ఫ్లాట్ బుక్ చేసుకున్నాం. 2017 డిసెంబర్లో ఫ్లాట్ అప్పగిస్తామని హామీ ఇచ్చారు. కానీ అది జరగలేదు. ఆ తర్వాత డెవలపర్ ఆ ఫ్లాట్ ను మరో ప్రైవేటు సంస్థకు తనఖా పెట్టారని, అనంతరం వేరొకరికి అమ్మేశారని మాకు తెలిసింది. 2019లో దీనిపై ఫిర్యాదు చేశాం. కానీ ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. సెటిల్మెంట్ కింద రూ.3 కోట్లు ఇస్తామని చెప్పారు. అది కూడా జరగలేదు’ అని వివరించారు. దీనిపై ఆయన పంజాబ్, హర్యాణా హైకోర్టుకు వెళ్లగా.. కోర్టు ఆదేశాల మేరకు నైనెక్స్ కంపెనీ, దాని డైరెక్టర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు.

This website uses cookies.