ప్రముఖ రచయిత చేతన్ భగత్ ఇల్లు కొనుక్కున్నారు. దక్షిణ ఢిల్లీలోని వెస్టెండ్ లో రూ.11.6 కోట్లు వెచ్చించి నాలుగు బెడ్ రూం ఫ్లాట్ తీసుకున్నారు. రెండంతస్తుల అపార్ట్ మెంట్ కాంప్లెక్స్ రెండో అంతస్తులో ఆయన ఈ ఫ్లాట్ కొనుగోలు చేశారు. జూన్ 24న ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ కూడా పూర్తయింది. స్టాంపు డ్యూటీ కింది రూ.70 లక్షలు చెల్లించినట్టు సమాచారం. ఈ ప్లాట్ సైజు 410 చదరపు మీటర్లుగా తెలిసింది. ఈ 4 బీహెచ్ కే ఫ్లాట్ ను 270 చదరపు మీటర్లలో నిర్మించారు. బంగ్లా లాంటి ఈ భవనం కేవలం మూడు అంతస్తులు మాత్రమే ఉంటుంది. బేస్ మెంట్, గ్రౌండ్, మొదటి, రెండో అంతస్తు మాత్రమే ప్రస్తుతానికి ఉంది. ఫలితంగా పెద్ద ఇల్లు రావడంతోపాటు ల్యాండ్ షేర్ 30 శాతం వరకు ఉంటుంది. కాగా, ఈ వ్యవహారంపై మాట్లాడటానికి చేతన్ భగత్ నిరాకరించారు.
This website uses cookies.