Categories: PROJECT ANALYSIS

వికారాబాద్ లో సంరక్ష ఫాం ల్యాడ్స్

  • గిరిధారి కొత్త ప్రాజెక్టు

నగర కాలుష్యానికి, రణగొణ ధ్వనులకు దూరంగా అప్పుడప్పుడు సేద తీరాలనుకునేవారికి గిరిధారి శుభవార్త తెచ్చింది. చదరపు గజాల్లో కాకుండా ఎకరాల్లో భూమిని సొంతం చేసుకోవాలనుకునేవారి కోసం వికారాబాద్ లో 60 ఎకరాల సారవంతమైన వ్యవసాయ భూమిలో సంరక్ష ఫాంల్యాండ్స్ తో కొత్త ప్రాజెక్టు లాంచ్ చేసింది. ఇందులోని ప్రతి యూనిట్ నూ సంరక్ష బృందం సరైన విధంగా మెయింటైన్ చేస్తుంది. మీరు మీ పొలం వెళ్లి, వ్యవసాయ అనుభూతిని ఆస్వాదించొచ్చు. బిజీబిజీ లైఫ్ నుంచి ఇక్కడ కాస్త ప్రశాంతంగా గడపవచ్చు.

ప్రత్యేకతలు ఇవీ..

ప్రాపర్టీకి ఇరువైపులా నీటి ప్రవాహాలు ఉన్నాయి. అందువల్ల నీటికి లోటుండదు. ఇంకా పోషకమైన, సారవంతమైన నేల కావడం వల్ల సాగు సులభం అవుతుంది. ప్రతి యూనిట్ కు ఈస్ట్, వెస్ట్ రోడ్లు, అవెన్యూ, ఫార్మ్ ప్లాంటేషన్స్, 45 అడుగులు, 30 అడుగుల అంతర్గత రోడ్లు, బిందు సేద్యం, విద్యుత్ సౌకర్యం, 8 అడుగుల ఎత్తులో జీఐ కంచె, మలబార్ వేప, చందనం అవెన్యూ ప్లాంటేషన్స్, సరిహద్దు లోపల ప్రైవేటు వంతెన, 100 శాతం క్లియర్ టైటిల్ వ్యవసాయ భూమి, తక్షణమే రిజిస్ట్రేషన్ వంటి సదుపాయాలు ఉన్నాయి. ఇంకా ఐదేళ్ల నిర్వహణతోపాటు క్లబ్ హౌస్ లో అత్యున్నత సౌకర్యాలతో కూడిన బసను కూడా పొందవచ్చు. ఫాంల్యాండ్ ప్రతి యజమానికి క్లబ్ హౌస్ లో ఏడాదికి 12 రోజులపాటు ఉచిత బస సౌకర్యం ఉంటుంది. వీటిని ఒకేసారి లేదా పలుమార్లు వినియోగించుకోవచ్చు. అయితే, 9 రోజులు వీక్ డేస్ లో.. మిగిలిన 3 రోజులు వీకెండ్స్ లేదా జాతీయ సెలవు దినాల్లో ఉపయోగించుకోవచ్చు.

క్లబ్ హౌస్ లో బోలెడు సౌకర్యాలున్నాయి. స్డూడియో రూమ్స్, రెస్టారెంట్, బటర్ ఫ్లై గార్డెన్, టెంట్స్, ఔట్ డోర్ స్పేసెస్, డక్ పూల్, లోటస్ పాండ్, పిల్లల ఆట స్థలం, బ్యాడ్మింటన్ కోర్టు, ఈవెంట్స్ స్టేజ్, పార్టీ లాన్, రెయిన్ డ్యాన్స్, ఏంఫిథియేటర్, స్విమింగ్ పూల్, మినీ బాంకెట్ హాల్, లాన్ టెన్నిస్, బాస్కెట్ బాల్ కోర్టు, ఔట్ డోర్ జిమ్, బార్ లాన్ వంటివి ఉన్నాయి. ఇక ప్రతి పావు ఎకరంలో 60 రకాల మొక్కలు పెంచుతారు. రకానికి పది చొప్పున 6 రకాల మొక్కలు పెంచుతారు. మామిడి, సీతాఫలం, వాటర్ ఏపిల్, నేరేడు, పనస, నిమ్మ, జామ, బత్తాయి, సపోటాల్లో 6 రకాలను ఎంచుకును అవకాశం ఇస్తారు. ఇక కనెక్టివిటీపరంగా చూస్తే.. అప్పా జంక్షన్ నుంచి ఇది 61 కిలోమీటర్ల దూరంలో ఉంది. శంషాబాద్ నుంచి 53 కిలోమీటర్లు, షాద్ నగర్ నుంచి 35 కిలోమీటర్లు, చేవెళ్ల, వికారాబాద్ నుంచి 32 కిలోమీటర్ల దూరంలో ఉంది. పూడూరు 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మరి ఓసారి వెళ్లి ఫాంల్యాండ్స్ చూసి.. సరైన నిర్ణయం తీసుకోండి.

This website uses cookies.